జాతీయ వార్తలు

ఎన్నికల్లో డ్రగ్స్ వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాలలో భారీగా మాదకద్రవ్యాల పంపిణీ జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నిఘా అధికారులు జరిపిన సోదాల్లో 1485 కిలోల నార్కొటిక్స్ పట్టుపడింది. దీని విలువ సుమారు రూ.10.30కోట్లు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు రూ.83కోట్ల నగదు, దాదాపు 12.65 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ల నుంచే స్వాధీనం కావటం గమనార్హం. ఒక్క యూపీలోనే 79కోట్ల నగదు స్వాధీనమైంది. పంజాబ్, గోవాలలో ఎక్కువ మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే సుమారు 1, 134 కిలోల నార్కోటిక్స్ లభించింది. ఎన్నికల సంఘం నియమించిన దాదాపు 200మంది అధికారులు నల్లధనానికి చెక్ పెట్టేందుకు నిఘాను కట్టుదిట్టంగా చేశారు.