జాతీయ వార్తలు

నలుగురికి రాష్టప్రతి ప్రాణభిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: ఉరిశిక్షలు పడిన నలుగురికి వారి శిక్షలను జీవిత ఖైదులుగా మార్చడం ద్వారా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. బిహార్‌లో 1992లో 34 మంది అగ్రవర్ణాల వారిని ఊచకోత కోసినందుకుగాను కృష్ణమోచి, ననే్హలాల్ మోచి, బిర్ కుయెర్ పాశ్వాన్, ధర్మేంద్ర సింగ్ అలియాస్ అధరు సింగ్ అనే నలుగురికి 2001లో సెషన్స్ కోర్టు మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2002 ఏప్రిల్ 15న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీ తీర్పుతో ఈ మరణ శిక్షలను ధ్రువీకరించింది. అయితే తమకు క్షమాభిక్షలను ప్రసాదించాలని కోరుతూ ఈ నలుగురూ రాష్టప్రతికి వినతులను పంపుకొన్నారు. అయితే వీరి క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించాలంటూ బిహార్ హోం మంత్రిత్వ శాఖ చేసిన సిఫార్సుల ఆధారంగా గత ఏడాది ఆగస్టు 8న కేంద్ర హోం శాఖ రాష్టప్రతికి సిఫార్సు చేసింది. అయితే ఈ నలుగురు దోషుల క్షమాభిక్ష పిటిషన్లను పంపించడంలో రాష్ట్రం చేసిన జాప్యం, జాతీయ మానవ హక్కుల కమిషన్ చేసిన వ్యాఖ్యలతోపాటుగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్టప్రతి వీరి మరణ శిక్షలను యావజ్జీవ శిక్షలుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నలుగురు దోషులు 2004 జూలై 7వ తేదీకి ముందే తమ క్షమాభిక్ష పిటిషన్లను సమర్పించినట్లు కమిషన్ ముందుంచిన వివిధ అంశాలను పరిశీలించిన తర్వాత స్పష్టమవుతోందని, బిహార్ ప్రభుత్వం, జైళ్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ సైతం ఈ విషయాన్ని అంగీకరించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ గత ఏడాది జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. అయితే ఈ క్షమాభిక్ష పిటిషన్లు హోం శాఖకు గానీ, రాష్టప్రతి సెక్రటేరియట్‌కు కానీ చేరనే లేదు. ఎన్‌హెచ్‌ఆర్‌సి జోక్యం చేసుకున్న తర్వాత దాదాపు 12 ఏళ్లు ఆలస్యంగా మాత్రమే వీటిని పరిశీలించడం జరిగింది.