జాతీయ వార్తలు

జల్లికట్టులో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై/మదురై, జనవరి 22: భారీ ఆందోళనల అనంతరం తమిళనాడులో తిరిగి ప్రారంభమైన జల్లికట్టు విషాదాన్ని మిగిల్చింది. పుదుక్కోటై జిల్లా రపూసల్‌లో ఆదివారం జరిగిన జల్లికట్టులో పాల్గొన్న యువకుల్లో ఇద్దరు మృతిచెందగా, 28 మంది గాయపడ్డారు. కాగా, జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తూ మదురైలో ఆందోళన చేస్తున్న వారిలో 48 ఏళ్ల చంద్రమోహన్ డీహైడ్రేషన్ కారణంగా చనిపోయాడు. కాగా, అలంగనల్లూరులో ప్రభుత్వం తరఫున జల్లికట్టును ప్రారంభించడం ద్వారా ఆందోళనకారుల ఆగ్రహాన్ని చల్లార్చాలనుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు నిరాశే ఎదురైంది.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం జల్లికట్టు పోటీలు జరిగాయి. అయితే జల్లికట్టుకు ఆర్డినెన్స్‌ద్వారా తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులు చెన్నైలోని మెరీనా బీచ్‌తో పాటుగా మదురై, దిండిగల్ తదితర ప్రాంతాల్లో తమ ఆందోళనలను కొనసాగించారు. రాపూసల్ గ్రామంలో జల్లికట్టు పోటీలను రాష్ట్ర ఆరోగ్య మంత్రి విజయ్ భాస్కర్ ప్రారంభించారు. ఆయన సమక్షంలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ఎద్దును లొంగదీసుకునే ప్రయత్నంలో రాజు, మోహన్ అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో 28 మందికి కూడా గాయాలయ్యాయి.
జల్లికట్టు పోటీలకు ప్రసిద్ధి చెందిన అలంగనల్లూరులో ఈ రోజు ఉదయం 10 గంటలకు జల్లికట్టు పోటీలను ప్రారంభిస్తానని పన్నీర్ సెల్వం శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకోసం ఆయన నిన్ననే మదురై వెళ్లారు కూడా. అయితే తమకు శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు జల్లికట్టు నిర్వహించడానికి నిరాకరించారు. అంతేకాదు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను మదురైలో అడ్డుకున్నారు. దీంతో ఆయన విధిలేని పరిస్థితిలో తన కార్యక్రమాన్ని మార్చుకోవలసి వచ్చింది. దిండిగల్లులోనైనా జల్లికట్టును ప్రారంభించాలని ఆయన అనుకున్నారు కానీ అక్కడ కూడా నిరసనలు కొనసాగుతుండడంతో చేసేదిలేక చెన్నైకి వెనుదిరగాల్సి వచ్చింది.
చెన్నైకి బయలుదేరే ముందు ముఖ్యమంత్రి విలేఖరులతో మాట్లాడుతూ, జల్లికట్టుపై శాశ్వత చట్టాన్ని తీసుకువస్తామని, ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతామని చెప్పారు. ఆందోళనలు విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో జల్లికట్టును నిర్వహించారని, స్థానిక అధికారులు, పోలీసులు జల్లికట్టు నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారని ఆయన చెప్పారు.

చిత్రాలు..ఆదివారం చెన్నైలోని మెరీనా బీచ్‌లో కొనసాగుతున్న ఆందోళన. కోయంబత్తూరులో ఎడ్ల పందేలను ప్రారంభిస్తున్న ఎఐఎడిఎంకె నేత వేలుమణి (ఇన్‌సెట్)