జాతీయ వార్తలు

చట్టబద్ధత ఏం చేశారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23:కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సాయంత్రం నార్త్‌బ్లాక్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి, డిమాండ్ చేశారు. డిజిటల్ చెల్లింపులకు జనామోదం పొందేందుకు అనుసరించవలసిన వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు ఏర్పాటైన కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు చంద్రబాబు సోమవారం దేశ రాజధానికి వచ్చారు. ఆయన మొదట సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ నివాసానికి వెళ్లి, ఆయనను పరామర్శించారు. జస్టిస్ రమణ మాతృమూర్తి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. జైట్లీ కూడా ఈ సంతాప సమావేశానికి హాజరయ్యారు. ఆ తరువాత ఇద్దరు నేతలూ నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్లి చర్చలు జరిపారు. కేంద్ర ప్రభుత్వం ఏపికి ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని సిఎం కోరారు. జైట్లీతో దాదాపు అరగంట సేపు జరిపిన చర్చల్లో చంద్రబాబు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన పలు హామీల అమలు గురించి కూడా చర్చించారని తెలిసింది. ‘ప్యాకేజీకి చట్టబద్ధత గురించి చర్చించాను. అయితే చర్చల వివరాలను ఇవాళ వెల్లడించలేను. మంగళవారం డిజిటల్ ఉపసంఘం సమావేశం ముగిసిన అనంతరం అన్ని విషయాలను వివరిస్తాన’ని ఆయన విలేఖరులతో చెప్పా రు. చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం నీతి ఆయోగ్ కార్యాలయంలో జరిగే డిజిటల్ ఉపసంఘం సమావేశానికి హాజరవుతున్నారు. ఆ తర్వాత ప్రధా ని మోదీతో భేటీ అవుతారు. మోదీతోనూ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే అంశానే్న ఆయన ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. జైట్లీతో జరిగిన భేటీకి చంద్రబాబుతోపాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేశ్ కూడా హాజరయ్యారు.