జాతీయ వార్తలు

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారా? ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీతో పొత్తు కుదరడంలో ప్రియాంక గాంధీ కీలకపాత్ర పోషించారని కాంగ్రెస్ పార్టీ వర్గాలే వెల్లడించిన నేపథ్యంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని, అదికూడా తన తల్లి సోనియా నియోజకవర్గమైన రాయ్‌బరేలినుంచి లోక్‌సభకు పోటీ చేస్తారన్న కథనాలు వినిపిస్తున్నాయి. సోనియా గాంధీ ఇటీవలి కాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్న విషయం తెలిసిందే. అందువల్ల వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాయబరేలినుంచి సోనియా స్థానంలో ప్రియాంక పోటీ చేయవచ్చని రాజకీయ విశే్లషకులు అంటున్నారు. ప్రియాంక గాంధీ ఇప్పటివరకు తెరవెనుకే ఉంటూ సోదరుడు రాహుల్ గాంధీకి సహాయపడడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, తమ కుటుంబ సభ్యులు ప్రాతనిధ్యం వహించే రాయ్‌బరేలి, అమేథీల్లో ప్రచారం చేయడం లాంటివి చేస్తూ వస్తున్నారు. అయితే సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలనుంచి క్రమంగా వైదొలగాలని నిర్ణయించుకోవడం ప్రియాంక ప్రాధాన్యత పెరగడానికి ప్రధాన కారణమని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ తన సోదరిపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదితో పొత్తు దాదాపుగా బెడిసికొట్టే పరిస్థితిలో ప్రియాంక చొరవ తీసుకొని పొత్తు కుదిరేలా చేశారని పార్టీ సీనియర్ నాయకులు సైతం చెప్తున్నారు. కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ప్రియాంక ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌తో కలిసి కూటమి అభ్యర్థుల తరఫున విస్తృతంగా చేస్తారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.