జాతీయ వార్తలు

ఇద్దరికి రాష్టప్రతి పోలీసు పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఇద్దరు పోలీసు అధికారులకు రాష్టప్రతి పోలీసు పతకాలు లభించాయి. సైబరాబాద్ జాయింట్ సీపీ శశిధర్ రెడ్డి, నాంపల్లి ఏఎస్పీ ఎం వెంకటేశ్వరరావులకు రాష్టప్రతి పోలీసు పతకాలు లభించాయి. అలాగే, ప్రతిభావంతమైన సేవలు అందించినందుకు 12మంది అధికారులకు పోలీసు పతకాలు ప్రకటించారు. వారిలో హైదరాబాద్ డిసిపి వి సత్యనారాయణ, హైదరాబాద్ ఇంటిలిజెన్స్ డిఎస్పీ సురేంద్రనాథ రెడ్డి, ఐడి ఎస్‌ఐ ప్రేంచందర్, మహబూబ్‌నగర్ ఎస్‌ఐ కె తిరుపజి, కరీంనగర్ ఎస్‌ఐ బుక్యా బాలా, కరీంనగర్ ఎస్‌ఐ (పిటిసి) సి శంకర్, హైదరాబాద్ ఎస్‌ఐ జవ్వాజి వెంకట శేషగిరిరావు, ఎఎస్‌ఐ షేక్ జలీల్ అహ్మద్, హెడ్ కానిస్టేబుల్ కె ప్రభాకర్, కానిస్టేబుల్ సత్యనారాయణ, కరీంనగర్ హెచ్‌సి కాశెట్టి కృష్ణ, అంబర్‌పేట్ ఏఎస్‌ఐ మహమ్మద్ మహమూద్ ఉన్నారు. హైదరాబాదులోని జాతీయ పోలీసు అకాడమీకి చెందిన జిఎస్ చుందావత్, హెడ్ కానిస్టేబుల్ భన్వర్‌లాల్‌కు గ్యాలెంట్రీ అవార్డులు లభించాయి.
ఇదిలావుంటే, మహరాష్ట్ర అదనపు డిజిపి, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణకు అరుదైన గౌరవం దక్కింది. అత్యున్నత సేవలు అందించినందుకు భారత రాష్టప్రతి నుంచి లభించే పోలీస్ మెడల్‌ను కేంద్రం ప్రకటించింది.

చిత్రాలు.. శశిధర్ రెడ్డి, వెంకటేశ్వరరావు