జాతీయ వార్తలు

నిఘా గుప్పిట ఢిల్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24:గణతంత్ర వేడుకలకు శత్రు దుర్బేధ్యమైన రీతిలో దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమవుతోంది. వివిఐపిలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు డ్రోన్‌ల ద్వారా గగత తలం నుంచీ దాడులు చేసే అవకాశం ఉందంటూ నిఘా వర్గాలు హెచ్చరించడంతో భద్రతా ఏర్పాట్లను మరింత ముమ్మరం చేశారు.్భతలం నుంచి గగన తలం వరకూ ఎలాంటి ఏమరపాటుకు అవకాశం లేకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందుకోసం వేలాదిగా సాయుధ దళాలను ఇప్పటికే మోహరించారు. గగన తల దాడులను తిప్పికొట్టేందుకు డ్రోన్ నిరోధక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు వినియోగిస్తున్నారు. హెలికాప్టర్లు, చార్టర్ విమానాల ద్వారా లష్కరే తోయిబా వంటి మిలిటెంట్ సంస్థలు దాడులు జరిపే అవకాశం ఉందని ఇటీవలే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. డ్రోన్ తరహా దాడులను నిరోధించే టెక్నాలజీని వినియోగిస్తున్నామని, అనుమానాస్పద రీతిలో ఎగిరే ఏ వస్తువునైనా దీని ద్వారా పసిగట్ట గలుగుతామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.వీటితో పాటు సమీపంలోని అన్ని భవనాలపైనా విమాన దాడుల నిరోధక తుపాకులతో రక్షణ సిబ్బందినీ మోహరిస్తారు. అన్ని కీలక ప్రదేశాల్లో సిసిటివి కెమేరాలను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవడానికి కంట్రోల్ రూమ్‌లనూ సిద్ధం చేశామని తెలిపారు. నగరంలోని జనసమ్మర్ధంగా ఉండే అన్ని ప్రాంతాల్లోనూ రెప్పవాల్చని నిఘా కొనసాగిస్తున్నారు. కీలక మార్కెట్‌లో విస్తృత స్థాయిలో తనిఖీలు జరుపుతున్నారు. ఇప్పటికే పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేసి అందరికీ నిఘా, భద్రతా విధులు అప్పగించామని అధికారులు తెలిపారు.