జాతీయ వార్తలు

కేంద్ర పథకాలకు ప్రతిబింబాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: భేటీ బచావో-్భటీ పఢావో, స్కిల్ ఇండియా, ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన, క్లీన్ ఇండియా-గ్రీన్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రచార కార్యక్రమాలు గురువారం నాటి గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొన్న వివిధ శకటాలలో ఇతివృత్తాలుగా చోటు చేసుకున్నాయి. మొత్తం 23 శకటాలు ఈ కవాతులో పాల్గొన్నాయి.
రాజ్‌పథ్ మీదుగా కన్నుల పండువగా సాగిన ఈ కవాతులో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 17 శకటాలు పాల్గొన్నాయి. కేంద్ర ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ), గృహ నిర్మాణ, పేదరిక నిర్మూలన, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖలు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్, శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి (సిఎస్‌ఐఆర్), కేంద్ర ప్రజా పనుల శాఖ (సిపిడబ్ల్యుడి)కు చెందిన శకటాలు ఆయా శాఖల నిర్వహిస్తున్న పథకాలు, ప్రచార కార్యక్రమాల ఇతివృత్తాలను ప్రదర్శించాయి. దేశంలో అతి పెద్ద పన్నుల సంస్కరణ అయిన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఇతివృత్తంతో కూడిన శకటాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శకటం ప్రదర్శించింది. ఎంఎస్‌ఎంఇ శకటం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద చేపట్టిన పథకాలను ప్రదర్శించింది. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ తన శకటం ద్వారా ఖాదీ రంగంలో తాను నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రదర్శించింది.