జాతీయ వార్తలు

‘త్రివేణి’కి అడిగిన రేటుకు కట్టబెట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును తనకు సంబంధించిన త్రివేణి సంస్థకు ఎలాంటి నియమాలు లేకుండా వారు అడిగిన రేటుకు కట్టబెట్టారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ఆరోపించారు. ఔరంగజేబు మాదిరిగా ఎన్ని సంవత్సరాలు పాలించినా మీరు మంచి పాలకులు కాలేరని చంద్రబాబుకు శాపనార్థాలు పెట్టారు. రామచంద్రరావు శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బాబుపై పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోశారు. 2014 ఎన్నికల్లో గెలిచిన అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నిరాకరించటంతో భయపడిన కేంద్ర ప్రభుత్వం పోలవరానికి సంబంధించిన ముంపు మండలాలను తెలంగాణ నుండి ఆంధ్రాలో చేర్చిందంటూ చంద్రబాబు చేసిన ప్రకటనను ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు సాక్ష్యాధారాలతో ఈ విషయాన్ని రుజువు చేస్తే బహిరంగంగా ఆయన పాదాలు పట్టుకుని క్షమాపణ చెబుతానంటూ సవాల్ విసిరారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేదా బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా చెప్పినా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టినందుకు విజయవాడ సెంటర్‌లో నిలబడి క్షమాపణలు కోరుకుంటానని రామచంద్రరావు ఆవేశంగా చెప్పారు. పోలవరం నిర్మాణాన్ని మీ అదుపులోకి ఎందుకు తెచ్చుకున్నారని ఆయన బాబును నిలదీశారు. విధి, విధానాలు పాటించకుండా ఒక సబ్ కాంట్రాక్టరుకు పోలవరం పనులు ఇవ్వటం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? అని నిలదీశారు. జల్లికట్టు స్ఫూర్తితో ప్రత్యేక హోదా, ఇతర డిమాండ్ల సాధనకు పోరాడాలంటూ లేఖ రాసిన తనపై చంద్రబాబు, ఆయన సత్రకాయలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. తెలుగుదేశం వారు తనను వ్యక్తిగతంగా దూషించటాన్ని ఆయన ఖండించారు. ‘మీ మాటలు చిలకపలుకుల్లా ఉన్నాయని చెబితే దాని అర్థం మాటలు ముద్దుగా ఉన్నాయని భావించాలి తప్ప ముక్కు వంకరగా ఉన్నదని అనుకుంటే ఎలా?’ అని ఆయన బాబుపై వ్యంగ్య బాణాలు విసిరారు. 2004కు ముందు దాదాపు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బాబు పోలవరం నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఇప్పుడు తన వల్లనే పోలవరం వస్తోందనటం సిగ్గు చేటని విమర్శించారు. పోలవరం కల సాఫల్యం కావటానికి కాంగ్రెస్ ప్రధాన కారణమని ఆయన చెప్పారు.తాను చాలాకాలం అధికారంలో ఉన్నానంటూ చంద్రబాబు చెప్పుకోవటాన్ని రామచంద్రరావు తప్పుపట్టారు. ఔరంగజేబు మాదిరిగా ఎక్కువ కాలం అధికారంలో ఉన్నంత మాత్రాన మంచి పాలకుడైనట్లు కాదని కెవిపి స్పష్టం చేశారు. చంద్రబాబుప్రవచనాలు ఇవ్వటం మానివేయాలని హితవు పలికారు. మిమ్మల్ని అందరూ గౌరవించాలంటారు కదా మరి మీరు అందరినీ గౌరవిస్తున్నారా? అని ప్రశ్నించారు. ‘ప్రత్యేక హోదా కోసం పోరాడాలంటూ లేఖ రాసిన నాపై మీ వాళ్లు ఎలాంటి విమర్శలు చేస్తున్నారో తెలియదా?’ అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పట్ల పోలీసులు గురువారం వ్యవహరించిన తీరును రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. వ్యవస్థను పోలీసుల పరం చేస్తున్న చంద్రబాబుకు కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.
రాష్టప్రతికి విజ్ఞప్తి
విభజన మూలంగా బాగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇప్పించటంతోపాటు ఇతర హామీలను అమలు చేయించేందుకు జోక్యం చేసుకోవాలని కెవిపి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. ఆయన ఈ మేరకు ఒక లేఖ రాశారు. విభజన చట్టంలోని హామీలతోపాటు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీలు, వాగ్దానాల అమలుపై కేంద్రంనుండి ఒక నివేదిక తెప్పించుకోవాలని తన లేఖలో రాష్టప్రతిని ఆయన కోరారు. వచ్చే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి చేసే ప్రసంగంలో ఈ అంశాన్ని పొందుపరచాలని ఆయన రాష్టప్రతిని కోరారు.