జాతీయ వార్తలు

కాంగ్రెస్ ఇక చరిత్రే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలంధర్, జనవరి 27: కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని, అది నిన్నటి పార్టీ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. దేశాన్ని దీర్ఘకాలం పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీని మునిగిపోతున్న నౌకతో పోల్చిన మోదీ ‘ఈ నౌకలో మీరు ఎక్కుతారా..’ అంటూ పంజాబ్ ప్రజల్ని ప్రశ్నించారు. తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా తన తీరునూ మార్చుకోవడం కాంగ్రెస్ లక్షణమన్నారు. జలంధర్‌లో శుక్రవారం జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన మోదీ కాంగ్రెస్‌కు నీతి, నియమాలు లేవన్నారు. యూపీ ఎన్నికల్లో అధికారమే ధ్యేయంగా సమాజ్‌వాది పార్టీతో చేతులు కలపడం రాజకీయ అవకాశవాదమేనంటూ విరుచుకు పడ్డారు. ‘ఇదోక వింత పార్టీ. పశ్చిమ బెంగాల్‌లో మనుగడ సాగించేందుకు అక్క్డ వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటుంది. ఎన్ని సీట్లిచ్చినా ఒప్పేసుకుంటుంది. యూపీ ఎన్నికల ప్రచారంలో అధికార సమాజ్‌వాది పార్టీపై దుమ్మెతిపోసి ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుంది’అంటూ ఎద్దేవా చేశారు. పంజాబ్‌లో మాదక ద్రవ్య సమస్యను ప్రస్తావించిన రాహుల్ గాంధీపైనా మోదీ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ రాజకీయ విలువల్ని మరింత దిగజారుస్తున్నారని, పంజాబ్ యువత ప్రతిష్ఠనే దిగజారుస్తున్నారని అన్నారు. ఇలాంటి అనాలోచిత ప్రకటనల వల్ల పంజాబీల కీర్తి ప్రతిష్ఠలకే భంగం కలుగుతోందని, వీటికి గట్టి బుద్ధి చెప్పేలా ఎన్నికల్లో ప్రజలు తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బాదల్‌నే మళ్లీ ఎన్నుకోవాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. గత ఏడు దశాబ్దాలుగా సాగిన విధ్వంస రాజకీయ ఫలితాలనే భారత దేశం చవిచూస్తోందని, వాటి స్థానే తాము అభివృద్ధి రాజకీయ సంస్కృతిని పాదుగొల్పామన్నారు. ఈ ఏడు దశాబ్దాల కాలంలో నల్లధనాన్ని మూటగట్టుకున్న వారికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మింగుడు పడటం లేదన్నారు. అధికారంలో లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్ తన సిద్ధాంతాలను గాలికొదిలేసి రాజకీయ లబ్ధి కోసమే పొత్తులు కుదుర్చుకుంటోందన్నారు.

చిత్రం.. జలంధర్‌లో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, బాదల్ తదితరులు