జాతీయ వార్తలు

ఉచిత ల్యాప్‌టాప్‌లు, ఆస్తిపన్ను రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జనవరి 27: పంజాబ్ ప్రజలపై ఆమ్‌ఆద్మీ పార్టీ వరాల వర్షం కురిపించింది. తమకు అధికారం అప్పగిస్తే ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు అందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామని, ఆవాస ఆస్తిపన్ను రద్దుచేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అలాగే రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిని అందిస్తామని శుక్రవారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేసింది.
2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జారీ చేసిన మేనిఫెస్టో తరహాలోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ వాగ్ధాన పత్రాన్ని విడుదల చేసింది. వీటితో పాటు సబ్ డివిజన్, జిల్లా స్థాయిలో ఆప్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని, 5 రూపాయలకే ఓ పూట భోజనం వీటిలో లభిస్తుందని తెలిపింది. 400 యూనిట్ల వరకూ విద్యుత్ వినియోగంపై టారిఫ్‌ను 50 శాతం తగ్గిస్తామని వెల్లడించింది. అమృత్‌సర్, ఆనంద్ సాహెబ్‌లను పవిత్ర పట్టణాలుగా ప్రకటిస్తామని ఆప్ పేర్కొంది. ఆప్ పంజాబ్ ఇన్‌చార్జి సంజయ్ సింగ్ ఈ మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల విషయంలో వెనక్కుతగ్గేది లేదని ప్రతిదాన్నీ త్రికరణ శుద్ధిగా అమలుచేస్తామని వెల్లడించారు.
రవాణా, లిక్కర్, ఇసుక తవ్వకాల మాఫియాను నిర్మూలిస్తామని, ఈ కాంట్రాక్టులను యువతకే అందిస్తామని తెలిపారు. నిరుద్యోగులకు ప్రభుత్వ రవాణా వాహనాలు నడిపేందుకు అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు.