జాతీయ వార్తలు

బెంగళూరులో కేంద్ర బలగాల మోహరింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 20: ప్రావిడెంట్ ఫండ్ అంశంపై వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు నిర్వహించిన నిరసన ప్రదర్శన సందర్భంగా హింస చెలరేగడంతో అధికారులు బెంగళూరు నగరంలో కేంద్ర బలగాలను మోహరించారు. నిషేధాజ్ఞలు జారీ చేశారు. మంగళవారంనాటి హింసలో తీవ్రంగా దెబ్బతిన్న జలహల్లి క్రాస్ రోడ్డు మీదుగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌కు చెందిన బలగాలు బుధవారం కవాతు నిర్వహించాయి. మరోవైపు, మంగళవారం చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనలకు సంబంధించి పోలీసులు 50 మందిని అరెస్టు చేశారు. జలహల్లి క్రాస్ రోడ్డుతో పాటు మంగళవారం పెద్ద ఎత్తున నిరసనలు, హింస చోటు చేసుకున్న మడివాలా నుంచి ఐటి కారిడార్ ఎలక్ట్రానిక్ సిటీ వరకు 15 ప్లాటూన్ల కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ (కెఎస్‌ఆర్‌పి), మూడు ప్లాటూన్ల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ బలగాలు, ఆర్‌ఎఎఫ్, ఆరు నుంచి ఏడు సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ (సిఎఆర్) ప్లాటూన్లను మోహరించినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. నేరశిక్షాస్మృతి (సిఆర్‌పిసి)లోని సెక్షన్ 144 కింద బెంగళూరు నగర వ్యాప్తంగా ఈ నెల 22 అర్ధ రాత్రి వరకు నిషేధాజ్ఞలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. సోమ, మంగళవారాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి మొత్తం 18 కేసులు నమోదు చేసి, 50 మందిని అరెస్టు చేసినట్లు తూర్పు బెంగళూరు నగర అదనపు కమిషనర్ హరిశేఖరన్ తెలిపారు. రాళ్లు రువ్విన, పోలీసులపై దాడికి దిగిన, వాహనాలను దగ్ధం చేసిన సంఘటనలకు సంబంధించిన ఫొటోలు, సిసిటివి ఫుటేజ్‌లు తమ వద్ద ఉన్నాయని, వాటి ఆధారంగా నిందితులను అరెస్టు చేస్తామని ఆయన వివరించారు. పోలీసులు గార్మెంట్ ఫ్యాక్టరీలకు వెళ్లి ప్రభుత్వ వైఖరిని కార్మికులకు తెలియజేస్తున్నారని ఆయన తెలిపారు. బుధవారం ఎలాంటి నిరసన ప్రదర్శనలు జరగలేదని, అయినప్పటికీ తాము బందోబస్తు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ నిబంధనల్లో తెచ్చిన మార్పులకు వ్యతిరేకంగా గార్మెంట్ కార్మికులు సోమవారం ప్రారంభించిన ఆందోళనలు, తద్వారా తలెత్తిన హింస మంగళవారం నాటికి అదుపుతప్పిన విషయం తెలిసిందే. అకస్మాత్తుగా తలెత్తిన ఆందోళన, హింసతో కేంద్రం పిఎఫ్ నిబంధలకు సంబంధించి తెచ్చిన మార్పులను మంగళవారం ఉపసంహరించుకుంది.