జాతీయ వార్తలు

కాంగ్రెస్‌కు ఎస్‌ఎం కృష్ణ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 28: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్ ఎం కృష్ణ శనివారం ఆ పార్టీని వీడారు. పార్టీనుంచి వైదొలగుతున్నట్లు ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. 84 ఏళ్ల కృష్ణ 1999నుంచి 2004 వరకు కర్నాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య పని తీరు నచ్చకే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.