జాతీయ వార్తలు

సైనికుల శౌర్యానికి ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: మహాత్మాగాంధీ జయంతి రోజయిన జనవరి 30ని అమరవీరుల దినోత్సవంగా పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 11 గంటల నుంచి రెండు నిమిషాల పాటు వౌనం పాటించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి మన సమాజ, మన దేశ సంప్రదాయం కావాలని ఆయన ఉద్బోధించారు. ప్రత్యేకించి యువత.. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా శౌర్య పురస్కారాలు పొందిన సైనికుల పరాక్రమం గురించి సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఇది ప్రజలకు గర్వకారణంగా, స్ఫూర్తివంతంగా ఉంటుందని ప్రధాని ఆదివారం జాతినుద్దేశించి చేసిన ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో పేర్కొన్నారు. దేశం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ కాశ్మీర్‌లో హిమపాతం వల్ల మృతి చెందిన సైనికులకు ఆయన నివాళులు అర్పించారు. పరీక్షల సీజన్ ప్రారంభం కావడంతో పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ప్రధాని ప్రోత్సహించారు. పరీక్షలను ఒక పండుగలా భావించాలని, ఒత్తిడికి లోనుకావద్దని ఆయన సూచించారు. ‘ఎక్కువ మార్కుల కోసం ఎక్కువగా నవ్వాలి’ తప్ప ‘జీవితానికి పరీక్ష’గా భావించవద్దని ఆయన పేర్కొన్నారు.
చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో విరామం తీసుకోవాలని, ఇలా మెదడు సేద తీరడం వల్ల చదివిన వాటిని జ్ఞాపకం ఉంచుకునే శక్తి పెరుగుతుందని మోదీ విద్యార్థులకు వివరించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ లాగా ప్రతి విద్యార్థి తనతో తానే పోటీ పడాలని, మరొకరితో కాదని ఆయన సూచించారు. ‘పరీక్ష ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలి. ఏడాది పొడవునా పడిన కష్టాన్ని నిరూపించుకునే అవకాశంగా పరీక్షను భావించాలి. పరీక్షలను ఉత్సాహంతో, ఆసక్తితో రాయాలి. పరీక్ష అంటే సంతోషం వ్యక్తం చేస్తారా? ఒత్తిడికి లోనవుతారా? అనేది మీ చేతుల్లోనే ఉంది’ అని ఆయన విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. సంతోషంగా భావించిన వారు విజేతలుగా నిలుస్తారని, ఒత్తిడిగా భావించిన వారు పశ్చాత్తాపానికి గురవుతారని ఆయన వివరించారు. పరీక్షను పండుగలా భావించినప్పుడు ఒత్తిడి.. సంతోషంగా మారుతుందన్నారు. ఎక్కువ మార్కుల కోసం కాకుండా ఎక్కువ జ్ఞాన సముపార్జన కోసం చదవాలని ఆయన పిలుపునిచ్చారు. దివంగత డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్‌లో ఫెయిల్ అయ్యారని పేర్కొంటూ, ఒకవేళ ఆయన ఓడిపోయానని భావించి ఉండి ఉంటే, దేశం ఒక గొప్ప శాస్తవ్రేత్తను, గొప్ప రాష్టప్రతిని అందుకొని ఉండేది కాదని మోదీ అన్నారు.
ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ కేటగరీలలో అవార్డులు అందుకున్న సైనికులను, వారి కుటుంబాలను ప్రధాని అభినందించారు. వచ్చే నెలలో 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న కోస్ట్‌గార్డ్‌ను ఆయన అభినందించారు. రాజ్యాంగం ప్రజలకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చిందని పేర్కొంటూ వాటిని నెరవేర్చడానికి కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు.