జాతీయ వార్తలు

పరిమితులు తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30:నోట్ల రద్దు ప్రభావం క్రమంగా సన్నగిల్లడంతో చిన్న వ్యాపారస్తులు, సామాన్యులకు ఆర్బీఐ మరింత వెసులు బాటు కల్పించింది. బ్యాంకులు, ఎటిఎమ్‌ల నుంచి కరెంట్ ఖాతాదారులు రోజువారి జరిగే విత్‌డ్రావల్స్‌పై పరిమితిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. పొదుపు ఖాతాలపై మాత్రం వారానికి 24 వేల రూపాయల మాత్రమే తీసుకునే పరిమితిని కొనసాగిస్తున్నట్టు తెలిపింది. కరెంట్ అకౌంట్లు, క్యాష్ క్రెడిట్లు అకౌంట్లు, ఓవర్ డ్రాఫ్ అకౌంట్లపై తక్షణం అమలులోకి వచ్చేలా పరిమితుల్ని తొలగిస్తున్నట్టు వివరించింది. అయితే ఎంత మేరకు నగదు తీసుకునే అవకాశం ఇవ్వాలన్న నిర్ణయాన్ని బ్యాంకులకే వదిలేసినట్టు తెలిపింది. సేవింగ్ ఖాతాలపై విధించిన పరిమితుల్ని ప్రస్తుతానికి యధాతధంగా కొనసాగిస్తామని, భవిష్యత్‌లో వీటికీ ఉపశమనం కలిగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.