జాతీయ వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్ పరువు నష్టం కేసు మార్చి 3కు వాయదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భివాండి (్థనే), జనవరి 30: ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త దాఖలు చేసిన పరువునష్టం కేసులో భివాండి కోర్టు మార్చి 3న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది. భివాండి మేజిస్ట్రేట్ కోర్టులో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ కేసు విచారణకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. తన వాంగ్మూలాన్ని ఇవ్వడానికి ఆయన తిరిగి మార్చి 3న కోర్టుకు హాజరు కానున్నారు. రాహుల్ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఈ కేసును మార్చి 3కు వాయిదా వేస్తున్నట్టు మేజిస్ట్రేట్ తుషార్ వజె ప్రకటించారు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తులే గాంధీని హతమార్చారు’ అని తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, ఈ విషయంలో విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని రాహుల్ గాంధీ ఇదివరకే సుప్రీంకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. సోమవారం కోర్టు వెలుపల రాహుల్ మీడియాతో మాట్లాడుతూ మహాత్మా గాంధీని హతమార్చిన సిద్ధాంతానికి వ్యతిరేకంగానే తాను పోరాడుతున్నానని చెప్పారు.
కోర్టులో రాహుల్ గాంధీ ఉపన్యాసాన్ని ప్రచురించిన పత్రిక మొత్తం ప్రతి తనకు ఇప్పటి వరకు అందలేదని ఆయన తరపు న్యాయవాదులు అశోక్ ముందెర్గి, నారాయణ్ ఐయర్ మేజిస్ట్రేట్‌కు తెలిపారు. కేవలం ఒక వార్తకు సంబంధించిన కత్తిరింపుల ప్రతి మాత్రమే అందిందని వారు వివరించారు. రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ముందు దానికి సంబంధించిన మొత్తం పత్రాలను తాము పరిశీలించ వలసి ఉందని అశోక్ తెలిపారు. తరువాత ఆయన ఐయర్‌తో కలిసి వాయిదా దరఖాస్తును దాఖలు చేశారు. రాహుల్ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు కోర్టుకు చేరుకున్నారు. ఆయన వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు అశోక్ చవాన్, సంజయ్ నిరుపమ్‌తో పాటు పలువురు పార్టీ మద్దతుదారులు ఉన్నారు. రాహుల్ మధ్యాహ్నం 1.30 గంటల వరకు అక్కడే వేచి ఉండవలసి ఉండాల్సి వచ్చింది.

చిత్రం..భివాండి కోర్టు వెలుపల విలేఖరులతో మాట్లాడుతున్న రాహుల్