జాతీయ వార్తలు

‘కృష్ణా’ విచారణ నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: ఉమ్మడి ఏపీకి కేటాయించిన కృష్ణా నది జలాలను విభజిత ఏపీ, తెలంగాణల మధ్య పంపిణీ చేయడంపై జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ మంగళవారం ఢిల్లీలో విచారణ జరపనుంది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్-89 ప్రకారం కృష్ణా జలాలు పంపిణీ కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేస్తూ గతంలో ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు, రిజయిండర్లను తమకు సమర్పించాలని రెండు రాష్ట్రాలను ఆ తీర్పులో ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తు తెలంగాణ సుప్రీంకోర్టుని ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్లను కొట్టివేసింది. జలాల పంపిణీపై విచారణ గత డిసెంబరులోనే జరగాల్సి ఉండగా అది జనవరి 23వ తేదీకి వాయిదా పడింది. అప్పటికల్లా రెండు రాష్ట్రాలు రీజాయిండర్‌లను ట్రిబ్యునల్‌కి సమర్పించక పోవడంతో రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు జనవరి 31కి వాయిదా వేశారు. అయితే ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలు రీజాయిండర్లను సమర్పించకపోవటంతో ట్రిబ్యునల్‌లో విచారణ మరోసారి వాయిదా పడే అవకాశాలున్నాయి.