జాతీయ వార్తలు

గృహ నిర్బంధంలో హఫీజ్ సరుూద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: ముంబయి దాడి కుట్రదారు హఫీజ్ సరుూద్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచినట్టుగా తెలుస్తోంది. లాహోర్‌లోని చౌబుర్జీ సమీపంలోని ఖాదీసియా మసీదులోనే ఆయన్ని హౌస్ అరెస్టు చేసినట్టుగా కధనాలు వెలువడుతున్నాయి. ఆయన సారధ్యంలోని జవాదే ఉద్ దవాను (జెయుడి) కూడా నిషేధించే అవకాశం ఉందని తెలుస్తోంది. పంజాబ్ రాష్ట్రం హోం శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టుగా సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఉగ్రవాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నుంచి వత్తిళ్లే పాక్ సర్కార్ చర్యకు కారణంగా చెబుతున్నారు. హఫీజ్ సరుూద్‌పైనా, ఆయన సారధ్యంలోని జెయుడిపైనా చర్యలు తీసుకోక పోతే ఆంక్షలు తప్పవంటూ అమెరికా నుంచి స్పష్టంగానే ఆదేశాలు అందినట్టుగా తెలుస్తోంది.