జాతీయ వార్తలు

దేశ వ్యాప్తంగా 5వేల జడ్జి పోస్టులు ఖాళీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: దేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ఐదువేల జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. న్యాయమూర్తులను సకాలంలో నియమించకపోవడం కూడా ప్రజల ప్రాథమిక హక్కులను భంగపరిచినట్లేనని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు గమనార్హం. సబార్డినేట్ కోర్టుల్లో 20214 మంది జడ్జిలు అవసరం కాగా, 4,600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే దాదాపు 23 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశంలోని 24 హైకోర్టుల్లో 462 జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే 44 శాతం పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులపైన వత్తిడి పెరుగుతోంది. సుప్రీం కోర్టులో 31 మంది న్యాయమూర్తుల అవసరం ఉంటే ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 1987లో లా కమిషన్ దేశంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి ఒక బ్లూప్రింట్‌ను ఖరారు చేసింది. ప్రతి పది లక్షల మందికి 10.5 మంది జడ్జిలు ఉండాలి. ఆ తర్వాత పది లక్షల మందికి 17 మంది న్యాయమూర్తులు ఉండాలని సిఫార్సు చేశారు. అయితే సబార్డినేట్ నుంచి పై స్ధాయి కోర్టుల వరకు ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత రెండేళ్లుగా జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలా, కొలీజియం వ్యవస్థను కొనసాగించాలా అనే అంశంపై నెలకొన్న సందిగ్ధత ఇటీవలనే వీడింది. కాని ఈ మధ్యలో జరిగిన జాప్యం వల్ల పై నుంచి కింది స్ధాయి వరకు పెండింగ్ కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో అన్ని కోర్టుల్లో కలిపి 3.10 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇటీవల లా ప్యానెల్ 120వ నివేదికను సుప్రీం కోర్టుకు, పార్లమెంటుకు సమర్పించింది. ప్రతి పది లక్షల మందికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని ఈ ప్యానెల్ సిఫార్సు చేసింది. అమెరికాలో ప్రతి పది లక్షల మందికి 107 మంది న్యాయమూర్తులు ఉంటారు. ఇంగ్లాండ్‌లో ప్రతి పది లక్షల మందికి 51 మంది, కెనెడాలో 75 మంది, ఆస్ట్రేలియాలో 42 మంది న్యాయమూర్తులు ఉన్నారు. జాతీయ లా కమిషన్ కూడా సుప్రీం కోర్టుకు, పార్లమెంటుకు 2014లో సమర్పించిన 245వ నివేదికలో ప్రతి పదిలక్షల మందికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలన్న సిఫార్సును ఆమోదించాలని కోరింది. ఈ లా ప్యానెల్ మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది. బిహార్‌లో ఇప్పుడున్న పెండింగ్ కేసులను క్లియర్ చేయాలంటే మూడేళ్లు పడుతుందని, 1624 మంది జడ్జిలను దీని కోసం నియమించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే వివిధ కోర్టుల్లో న్యాయమూర్తులు నియామకం చేపట్టి, శిక్షణ, ఆధునిక టెక్నాలజీని నేర్పించడం చేయాల్సి ఉందని లా కమిషన్ స్పష్టం చేసింది.