జాతీయ వార్తలు

ఘనంగా జల్లికట్టు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదురై, ఫిబ్రవరి 5: తమిళనాడులోని అవనీయపురం జిల్లాలో నిర్వహించిన జల్లికట్టులో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాలైన వారిలో ఒకరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి వైద్య శిబిరంలో చికిత్సను అందించారు. గట్టి బందోబస్తు మధ్య అవనీయపురం జిల్లాలో సుమారు 900లకు పైగా ఎద్దులతో జల్లికట్టు నిర్వహించారు. రెవెన్యూ మంత్రి ఆర్ బి ఉదయ్‌కుమార్, జిల్లా కలెక్టర్ వీర రాఘవరావు కలిసి ఆదివారం దీన్ని ఘనంగా ప్రారంభించారు. దీనికి పోలీసు ఉన్నతాధికారులు సైతం హాజరయ్యారు. 700 మంది ఈ జల్లికట్టులో పాల్గొన్నారు. జల్లికట్టును చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. నాలుకేళ్ల కిందట సుప్రీం కోర్టు జల్లికట్టుపై నిషేధం విధించడంతో నాటినుంచి దీనికోసం తమిళనాడులో తీవ్రంగా పోరాటం జరుగుతోంది. ఈ సంవత్సరం జనవరి 23న తమిళనాడు అసెంబ్లీ జల్లికట్టుపై సవరణ బిల్లును ఆమోదించింది. కేంద్రం కూడా దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ జారీ చేయడంతో ఈ జల్లికట్టుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. ప్రతి సంవత్సరం పొంగల్ సందర్భంగా ఆడే ఈ సంప్రదాయ క్రీడను ప్రస్తుతం తమిళనాడులో పలు చోట్ల అట్టహాసంగా నిర్వహిస్తున్నారు.