జాతీయ వార్తలు

ఓటేయనప్పుడు ప్రశ్నించే అధికారం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: మీరు ఓటేయనప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే, లేదా తప్పు బట్టే అధికారం మీకు లేదు..’ దేశ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్య ఇది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆక్రమణలను తొలగించాలని ఆదేశించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలు చేసిన పౌర హక్కుల ఉద్యమ కార్యకర్త తాను ఇప్పటిదాకా ఓటేయలేదని చెప్పడాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అన్ని రాష్ట్రాలకు చెందిన ఆక్రమణల విషయంలో కోర్టు ఏకపక్షంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయజాలదని ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానిస్తూ,‘ప్రతిదానికీ ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు. ఒక వ్యక్తి తన ఓటు హక్కును వినియోగించుకోనప్పుడు అతనికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉండదు’ అని స్పష్టం చేసింది. అంతేకాదు ఢిల్లీలో కూర్చుని దేశవ్యాప్తంగా జరిగిన ఆక్రమణలను చూడడం కోర్టుకు సాధ్యం కాదని బెంచ్ అంటూ, రోడ్లు, పేవ్‌మెంట్లపై ఆక్రమణలను ఎక్కడెక్కడ చూశారో, ఆయా రాష్టాల హైకోర్టులను ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది.
ఆక్రమణలను తొలగించడానికి ప్రభుత్వాలు ఏమీ చేయడం లేదని, అందువల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఆక్రమణలన్నిటినీ తొలగించాలని ఆదేశిస్తూ ఒకే ఉత్తర్వు ఇవ్వాలని ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ‘ వాయిస్ ఆఫ్ ఇండియా’ తరఫు న్యాయవాది ధనేష్ లెష్‌ధన్ పట్టుబట్టినప్పుడు బెంచ్ మీరు ఎప్పుడైనా ఓటేశారో లేదో చెప్పాలని ఆయనను అడిగింది. దానికి ఆయన నిజం చెప్పాలంటే తాను ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓటేయలేదని చెప్పడంతో ఆగ్రహించిన బెంచ్ ‘మీరు ఓటేయనప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదు’ అని తీవ్రస్వరంతో వ్యాఖ్యానించింది. ఈ బెంచ్‌లో న్యాయమూర్తులు ఎన్‌వై రమణ, డివై చంద్రచూడ్ కూడా ఉన్నారు.