జాతీయ వార్తలు

ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: కేంద్ర బడ్జెట్‌లో ఎస్సీ ఎస్టీలకు నిధుల కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. దళిత్ శోషణ్ ముక్తి మంచ్ (డీఎస్‌ఎంఎం) ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో గల గురజాడ హాలులో బడ్జెట్‌లో దళితులకు కేటాయింపులు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి రాజా, బివి రాఘవులు, ఎంపి జితేందర్ చౌదరి, వామపక్షాల నాయకులు వి.శ్రీనివాస్ రావు, పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు. నీతి ఆయోగ్ సూచన మేరకు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్ట సవరణలకు వ్యతిరేకంగా రాష్టప్రతిని కలవాలని డిఎస్‌ఎంఎం రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు. అనంతరం సీతారాం ఏచూరి మాట్లాడుతూ మొదటి విడత పార్లమెంట్ సమావేశాలు నిరంకుశంగా జరిగాయన్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆయన మండిపడ్డారు.