జాతీయ వార్తలు

కార్మికుల సంక్షేమానికి కట్టుబడిన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: కార్మికుల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కట్టుబడి ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో వేతన చెల్లింపుల చట్ట సవరణ బిల్లు-2017కు ఆమోదించినందుకు దత్తాత్రేయ అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. గురువారం దత్తాత్రేయ ఢిల్లీలోని తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఈ చట్టం అమలుతో కార్మికులకు సకాలంలో జీతాలు అందుతాయని అన్నారు. గత సమావేశాలలో పార్లమెంట్ సజాపుగా జరగనందున ఈ బిల్లుకు ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చినట్టు ఆయన చెప్పారు. కొన్ని సంస్థలు వేతనాలు ఇవ్వకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, చట్టం అమలుతో వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తే, ఆయా సంస్థల యాజమాన్యాలపై 6 నెలల పాటు కఠిన చర్యలు తీసుకోవచ్చన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన అన్నారు.