జాతీయ వార్తలు

ఎలక్షన్ ఫండింగ్‌కు అభ్యంతరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ఖర్చును భరించే ప్రతిపాదనను పరిశీలించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. అరుణ్‌జైట్లీ గురువారం లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు బదులిస్తూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ఖర్చును భరించినా అభ్యర్థులు తమ స్వంత డబ్బును ఖర్చు పెట్టరనే గ్యారంటీ ఏమైనా ఉంటుందా? అని ఆయన తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు సౌగత్‌రాయ్ నుద్దేశించి చెప్పారు. రాజకీయ పార్టీల విరాళాలను మరింత పారదర్శకం చేసేందుకు సభ్యులు ఎలాంటి సూచనలు, ప్రతిపాదనలు చేసినా పరిశీలిస్తామని జైట్లీ సూచించగానే సౌగత్‌రాయ్ లేచి ఎన్నికల ఖర్చును ప్రభుత్వం భరిస్తే సరిపోతుందని సూచించారు. జైట్లీ పక్కన కూర్చున్న లాల్‌కృష్ణ అద్వానీ లోక్‌సభ, శాసన సభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించటం గురించి చెప్పాలని కోరారు. రాజకీయ విరాళాల వ్యవహారాన్ని మరింత పారదర్శకం చేసేందుకు ఎవరు, ఎలాంటి ప్రతిపాదనలు చేసినా పరిశీలించి అవసరం మేరకు నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక శాఖ మంత్రి పేర్కొన్నారు. లోక్‌సభ బడ్జెట్ తదుపరి సమావేశాల్లో ఆర్థిక బిల్లుపై చర్చ జరిగే సమయంలో ఈ అంశంపై మరింత చర్చ జరగాలి, ప్రభుత్వం కూడా తమ ఆలోచనలను వెల్లడిస్తుందన్నారు. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు విరాళాలపై పరిమితులు విధించామన్నారు. రాజకీయ పార్టీలు కేవలం రెండు వేల రూపాయల వరకు మాత్రమే విరాళాలను నగదు రూపంలో తీసుకోవాలనే ప్రతిపాదన ప్రభుత్వానికి కాదని జైట్లీ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల నగదు విరాళాల పరిమితిని ఇరవై వేల నుండి రెండు వేల రూపాయలకు తగ్గించాలని కేంద్ర ఎన్నికల సంఘం సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం దానిని యథాతథంగా తీసుకుని బడ్జెట్‌లో ప్రకటించటం జరిగిందని జైట్లీ వివరించారు. రాజకీయ పార్టీల నగదు విరాళాలను పూర్తిగా నిషేధించేందుకు కూడా ప్రభుత్వానికి అభ్యంతరం లేదని అరుణ్ జైట్లీ తెలిపారు. రాజకీయ పార్టీల విరాళాలను పారదర్శకం చేసేందుకే డిజిటల్ చెల్లింపులు, చెక్కులు, బాండ్లను ప్రోత్సహిస్తున్నామని ఆయన వివరించారు. చెక్కు రూపంలో విరాళాలు ఇస్తే ఇచ్చిన వారి వివరాలు తెలిసిపోతాయి అయితే బాండ్ల రూపంలో ఇస్తే మాత్రం విరాళం ఇచ్చిన వారి వివరాలు గుప్తంగా ఉండిపోతాయి. ఎందుకుంటే బాండ్లు కొనుగోలు చేసేవారి వివరాలను వెల్లడించవలసిన అవసరం బ్యాంకులకు లేదన్నారు. బ్యాంకింగ్ చట్టాల ప్రకారం ఈ వివరాలను వెల్లడించేందుకు బ్యాంకులు నిరాకరించేందుకు వీలున్నదన్నారు. చివరకు ప్రభుత్వానికి కూడా ఈ వివరాలు వెల్లడించేందుకు బ్యాంకులు నిరాకరించేందుకు చట్టాలు వీలు కల్పించాయని జైట్లీ తెలిపారు. ఆర్థిక బిల్లుపై చర్చ జరిగే సమయంలో రాజకీయ పార్టీల విరాళాల అంశంపై లోతుగా చర్చ జరిపి ఒక నిర్ణయం తీసుకోవటం మంచిదని ఆయన సూచించారు. అధిక నగదు ఆర్థిక వ్యవస్థ పన్ను ఎగవేత, అవినీతికి దారి తీస్తుందని జైట్లీ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతం వద్ద అదుపు చేయాలని రిజర్వు బ్యాంక్ ఆలోచిస్తోందంటూ ప్రస్తుతం ద్రవ్యోల్బణం 3.6 శాతం ఉన్నదన్నారు.