జాతీయ వార్తలు

సొంతింటి కల ఇక సులువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే వారికి శుభవార్త. వార్షిక ఆదాయం ఏడాదికి రూ.18 లక్షలలోపు ఉండి, గృహ రుణం తీసుకోవాలనుకుంటే, రుణంలో రూ. 2.4 లక్షల వరకూ వడ్డీ రాయితీ పొందే రెండు పథకాలను కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ఈ సబ్సిడీ ఏడాదికి 6 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి మాత్రమే వర్తిస్తోంది. అయితే 2022 నాటికి అందరికీ సొంతింటి కల సాకారం చేయడం, రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి అదనంగా రెండు కొత్త సబ్సిడీ శ్లాబ్‌లను ప్రకటించింది. ఈ శ్లాబ్‌లు 20 ఏళ్ల కాలవ్యవధి కలిగిన రుణాలకు వర్తిస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ గత డిసెంబర్ 31న ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ కింద రెండు సబ్సిడీ పథకాలను ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ పథకాల విధివిధానాలను అధికారులు ఇప్పుడు ప్రకటించారు. ఈ పథకాల కింద గృహాలను కొనుగోలు చేసే వారు తమ ఆదాయం ఆధారంగా వేర్వేరు రేట్ల ప్రకారం రుణాల వడ్డీలో సబ్సిడీని పొందుతారు. ఏడాదికి ఆరు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉండే వారు రూ. 6 లక్షల దాకా రుణం తీసుకుంటే తీసుకున్న మొత్తంపై 6.5 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. మిగిలిన వడ్డీని మాత్రమే వారు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు 9 శాతం వడ్డీ రేటుపై రుణం తీసుకున్నారనుకుంటే 6.5 శాతం వడ్డీ రాయితీ పోను మిగతా 2.5 శాతం మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆరు లక్షలకు పైబడిన మొత్తంపై వడ్డీ రాయితీ ఉండదు. అలాగే రూ. 12 లక్షల వార్షికాదాయం కలిగిన వారు 9 లక్షల లోపు రుణం తీసుకుంటే దానిపై 4 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. 18 లక్షల రూపాయల వార్షికాదాయం కలిగిన వారు 12 లక్షల రూపాయల దాకా రుణం తీసుకుంటే దానిపై 3 శాతం దాకా వడ్డీ రాయితీ పొందడానికి అర్హులు. 20 సంవత్సరాల కాలపరిమితి కలిగిన రుణ మొత్తాలపై మొత్తం కాలావధిలో (9 శాతం వడ్డీ రేటుగా భావిస్తే) రూ. 2.4 లక్షల రూపాయల దాకా ఆయా ఆదాయ వర్గాలవారు వడ్డీ రాయితీ పొందగలుగుతారు. అంటే నెలవారీ వాయిదా మొత్తం దాదాపు రూ.2,200 దాకా తగ్గుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లభించే ఈ సబ్సిడీ ప్రయోజనం గృహ రుణాలపై పొందే ఆదాయం పన్ను రాయితీలకు అదనం. నేషనల్ హౌసింగ్ బ్యాంక్, హడ్కో కలిసి ఈ సబ్సిడీ పథకాలను అమలు చేస్తాయి. తక్కువ ఆదాయ వర్గాలకు వర్తింపజేసే పథకం కింద ప్రభుత్వం తొలిసారి గృహాలను కొనుగోలు చేసే దాదాపు 18,000 మందికి రూ.310 కోట్ల వ్యయంతో సబ్సిడీని అందజేసింది. మధ్య ఆదాయ వర్గాలను కూడా ఈ పథకం కిందికి తీసుకు వచ్చినందున ఈ సబ్సిడీ వితరణ మరింతగా పెరుగుతుందని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.