జాతీయ వార్తలు

బులంద్‌షహర్ బాధితులకు అందని న్యాయం: ఉమాభారతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగ్రా, ఫిబ్రవరి 10: ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని, నేరాలకు అడ్డూఅదుపులేదని కేంద్ర మంత్రి ఉమా భారతి ధ్వజమెత్తారు. రాష్ట్రం లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ఉమ యూపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బులంద్‌షహార్ సామూహిక అత్యాచార బాధితులకు న్యాయం జరగలేదని ఆమె విమర్శించారు. రేపిస్టులపై ఎలాంటి చర్యలూ లేవని అమె అన్నారు. సమాజ్‌వాదీ ప్రభుత్వం కేసుపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆమె విరుచుకుపడ్డారు. తన హయాంలో ఎక్కడైనా అత్యాచారం ఘటన జరిగితే నిందితుల పట్ల కఠినంగా ఉండేదాన్నని మంత్రి అన్నారు. నిందితులన పట్టుకుని బుద్ధి చెప్పాలని మహిళలకు పిలుపునిచ్చేవాళ్లమని ఉమభారతి తెలిపారు. రేపిస్టులను చిత్ర హింసలకు గురిచేసి ఆ గాయాలపై ఉప్పు,కారం పొడి రాయాలని, జీవితాంతం గుర్తుండేలా శిక్ష ఉండాలని ఆమె చెప్పారు.‘నేను ముఖ్యమంత్రిగా ఉండగా ఓ అత్యాచార ఘటన సందర్భంలో ఇలానే చేయించాను. పోలీసు అధికారులు వచ్చి మానవ హక్కుల ఉల్లంఘన అని నాతో చెప్పారు. రాక్షసులకు బుద్ధి చెబితే మానవ హక్కుల ఉల్లంఘన ఎలా అవుతుందని పోలీసులను ప్రశ్నించాను’అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.