జాతీయ వార్తలు

తొలి మలుపు ఎటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బిఎస్‌పి అధినాయకురాలు మాయావతికి తొలి అగ్నిపరీక్ష రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది. జాతీయ రాజకీయాల దశ, దిశను మార్చే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ రేపు ఉదయం జరుగుతుంది. గౌతంబుద్ నగర్, మీరట్, మథురా తదితర పదిహేను జిల్లాల్లోని 73 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న 839 మంది అభ్యర్థుల తలరాతను రెండు కోట్ల అరవై లక్షల మంది ఓటర్లు ఈ నెల 11న అంటే రేపు నిర్ణయించనున్నారు. జాట్, ముస్లిం, బాగా వెనుకబడిన వర్గాలకు చెందిన ఓటర్లు అధికంగా ఉన్న ఈ పదిహేను జిల్లాల్లో మెజారిటీ సీట్లు గెలుచుకునేందుకు అధికారంలో ఉన్న సమాజ్‌వాదీతో పాటు బిజెపి, బిఎస్‌పి పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేశాయి. దక్షిణ ఆగ్రా అసెంబ్లీ నియోజకవర్గం నుండి అత్యధిక 26 మంది అభ్యర్థులు పోటీ పడుతుంటే, అతి తక్కువ మంది, అంటే ఆరుగురు హస్తీనాపూర్ నియోజకవర్గం నుండి పోటీలో ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీని ఆనుకుని నోయిడా, ఘజియాబాద్ తదితర పదిహేను జిల్లాల్లోని ఓటర్లు పెద్ద నోట్లను రద్దు చేయటం ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక సంస్కరణలకు తెరలేపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మద్దతు ఇస్తారా? లేక తన తండ్రి, బాబాయిపై తిరుగుబాటు చేసి తన రాజకీయ సత్తాను చాటుకున్న ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు మద్దతు ఇస్తారా? అనేది వేచి చూడవలసిందే. గత ఎన్నికల్లో ఈప్రాంతంలోని 73 నియోజకవర్గాలలో నుండి సమాజ్‌వాదీ, బిఎస్‌పి చెరి 24 సీట్లు గెలుచుకుంటే అజిత్ సింగ్ నాయకత్వంలోని ఆర్‌ఎల్‌డి తొమ్మిది సీట్లు, కాంగ్రెస్ ఐదు, బిజెపి పదకొండు సీట్లు గెలుచుకున్నాయి. ఈసారి సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయటంతో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవటం వలన సమాజ్‌వాదీ పార్టీ విజయావకాశాలు బాగా పెరిగాయని అంటున్నారు. మెజారిటీ ముస్లింలు ఇప్పుడు సమాజ్‌వాదీ, కాంగ్రెస్ కూటమివైపు మొగ్గుచూపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తనయుడు పంకజ్‌సింగ్ నోయిడా నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ప్రదీప్ మాథుర్ మథురా నుండి పోటీ చేస్తున్నారు. మాథుర్ పై బిజెపి అధికార ప్రతినిధి శ్రీకాంత్ శర్మ రంగంలోకి దిగారు. బిజెపి పార్లమెంటు సభ్యుడు హుకుం సింగ్ కూతురు మృగాంకా సింగ్ ఖైరానా నుండి పోటీ చేస్తుంటే బిజెపికి చెందిన అత్యంత వివాదాస్పద శాసన సభ్యులు సంగీత్ సోం, సురేష్ రాణాలు సర్దానా, తనభవన్ నియోజకవర్గాల నుండి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి అధినాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు రాహుల్ సింగ్ సికందరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సమాజ్‌వాదీ టికెట్‌పై పోటీకి దిగారు. రాజస్తాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ మనువడు సందీప్ సింగ్ అత్రౌలీ నియోజకవర్గం నుండి పోటీ చేయటం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మొదట దశ పోలింగ్ ప్రత్యేకత ఏమిటంటే ఆర్‌ఎల్‌డి టికెట్‌పై పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి ఓటర్ల సానుభూతి సంపాదించేందుకు తన సోదరుడిని హత్య చేయించి ప్రతిపక్షాలు చేయించాయని ఆరోపించటం.