జాతీయ వార్తలు

మీరే చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ రాజకీయం సినీ క్లైమాక్స్ ఫక్కీలో వేడెక్కిపోతోంది. పుకార్ల షికార్లు కాక పుట్టిస్తున్నాయి. బలాబలాల లెక్కలు మారుతున్నాయి. మెజార్టీ తనదేనన్న ధీమాగా ఉన్న శశికళకు ఆదివారంనాటి పరిణామాలు ఆందోళనకు గురిచేశాయి. మరో ఐదుగురు ఎంపీలు పన్నీర్‌సెల్వం శిబిరంలోకి జారుకున్నారు. దీనితో ఆయన బలం 11కు పెరిగింది. పోయెస్ గార్డెన్‌లో మీడియాతో మాట్లాడిన శశికళ రాజకీయాల్లో రాణించడం మహిళలకు కష్టమేనన్నారు. ఇప్పుడు తాను ఎదుర్కొంటున్న పరిస్థితుల్నే నాడు జయలిలితా అనుభవించారన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు ఉన్న నగర శివార్లలోని శిబిరానికి తరలి వెళ్లారు. ఎవరి స్వేచ్ఛకూ ఎలాంటి ఇబ్బంది లేదని, ఎవర్నీ తాను నిర్బంధించలేదంటూ మీడియా ముందుకు వారిని తీసుకొచ్చారు. ఇదంతా విరోధులు పుట్టిస్తున్న కట్టుకథేనన్నారు. కోర్టు తీర్పుపై ఊహాగానాలెందుకు.. వచ్చాకా చూద్దాం..’అంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమిళనాడు వ్యవహారాన్ని సోమవారం నాటికల్లా తేల్చక పోతే కోర్టుకెక్కుతానని బిజెపి సీనియర్ నేత సుబ్రమణ్యం స్వామి హెచ్చరించడం సరికొత్త మలుపు.

చిత్రం..కూవత్తూర్ రిసార్ట్‌లో ఆదివారం తనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలతో కలిసి
విలేఖరులతో మాట్లాడుతున్న శశికళ