జాతీయ వార్తలు

ఢిల్లీలో సమ్మెబాట పట్టిన క్యాబ్ డ్రైవర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశ రాజధానిలో క్యాబ్ డ్రైవర్లు సమ్మెబాట పట్టారు. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజుల నుంచి క్యాబ్ డ్రైవర్లు సమ్మెకు దిగారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌కే పరిమితమైన క్యాబ్ డ్రైవర్ల ఆందోళన దేశ రాజధానికి కూడా తాకింది. ఢిల్లీ క్యాబ్ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు కమల్జీత్ గిల్ మాట్లాడుతూ ఓలా, ఉబర్‌ల పుణ్యమా అని రోడ్డు పాలయ్యామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను కేంద్ర రవాణా మంత్రికి, ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని వాపోయారు. ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొంటున్నారని వెల్లడించారు. గత మూడు రోజులుగా క్యాబ్ డ్రైవర్ల ఆందోళనతో దాదాపు దేశ రాజధానిలో 60 వేల కార్లు నిలిచి పోయాయని కమల్జీత్ గిల్ వెల్లడించారు. సమస్య పరిష్కారానికి ఓలా, ఉబర్ సంస్థలు ముందుకు రావడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.