జాతీయ వార్తలు

చిన్నమ్మకు చెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ చెన్నై, ఫిబ్రవరి 14:జయలలిత వారసురాలిగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలన్న శశికళ కలలు కల్లలయ్యాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, విఎన్ సుధాకరన్, ఎళావరసిలలను సుప్రీం కోర్టు మంగళవారం దోషులుగా నిర్థారించింది. నాలుగేళ్ల పాటు జైలు శిక్షతో పాటు శశికళపై పదికోట్ల రూపాయల జరిమానా విధించింది. పదేళ్ల పాటు పంచాయతీ సహా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి వీల్లేని పరిస్థితి ఈ తీర్పుతో శశికళకు ఎదురైంది. తక్షణమే బెంగళూరులోని ట్రయల్ కోర్టులో లొంగిపోవాలని ఆమెను సుప్రీం కోర్టు ఆదేశించింది. గత 19సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ కేసుకు సంబంధించి విస్తృత స్థాయిలో మొత్తం 570 పేజీల తీర్పును న్యాయమూర్తులు పిసి ఘోష్, అమితావ రాయ్‌లతో కూడిన బెంచి వెలువరించింది. వీరికి శిక్ష విధిస్తూ గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పునే యధాతధంగా పునరుద్ధరించింది. వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ అనంతరం కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. వెంటనే బెంగళూరులోని ట్రయల్ కోర్టులో లొంగిపోయి మిగతా శిక్ష కాలాన్ని అనుభవించాలని దోషుల్ని ఆదేశించింది. ఇప్పటికే శశికళ ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు కాబట్టి మరో సుప్రీం తీర్పు ప్రకారం ఆమె మరో మూడున్నర సంవత్సరాల పాటు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. పోయెస్ గార్డెన్ కేంద్రంగా జయలలితతో పాటు శశికళ కుట్ర పన్నారని, అనేక అక్రమాలకూ పాల్పడ్డారని, లెక్కలేనన్ని బ్యాంకు ఖాతాలు తెరిచి అక్రమార్జనను మళ్లించుకున్నారని సుప్రీం కోర్టు తన సుదీర్ఘ తీర్పులో పేర్కొంది. ‘అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి మా వద్ద ఉన్న ఆధారాలు, సాక్షాల ప్రకారం కర్నాటక హైకోర్టు తీర్పును కొట్టివేస్తున్నాం. వీరికి శిక్ష విధిస్తూ అక్కడి ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా ధృవీకరిస్తున్నాం’అని సుప్రీం బెంచి తెలిపింది. కేవలం ఎనిమిది నిముషాల వ్యవధిలోనే ఈ కీలక కేసులో కోర్టు తీర్పు పూర్తయింది. అక్రమాస్తుల కేసులో జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష వంద కోట్ల జరిమానా విధించిన ట్రయల్ కోర్టు శశికళ, మిగిలిన్న ఇద్దరికి నాలుగేళ్ల జైలు, పదికోట్ల జరిమానా విధించింది. ఈ శిక్షనే సుప్రీం తీర్పు ప్రకారం వీరు అనుభవించాల్సి ఉంటుంది. కాగా సుప్రీం తీర్పుపై అప్పీలుకు వెళతామని అన్నాడిఎంకె సీనియర్ నేత తంబిదురై ప్రకటించారు.