జాతీయ వార్తలు

యర్రగుంట్ల మీదుగా విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఫిబ్రవరి 14: విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలును ఇక నుంచి కడప జిల్లా మీదుగా నడుపనున్నారు. రాజధాని అమరావతి నుండి రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, కర్నూలు జిల్లా వాసులకు అనుకూలంగా ఉండేలా గత ఏడాది విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలును వారానికి మూడు రోజులు నడిపేలా ఏర్పాటుచేశారు. ఇదే రైలును ఈ ఏడాది మే నెల 16వ తేదీ నుండి కడప జిల్లా యర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మీదు గా ధర్మవరం వరకు నడపాలని నిర్ణయించినట్లు గుంటూరు డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు రైల్వే బోర్డు నుండి అనుమతి లభించిందని వారు తెలిపారు. ధర్మవరం - విజయవాడ ఎక్స్‌ప్రెస్ (నెం.17216) రైలు ధర్మవరంలో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి అనంతపురం 4.30 గంటలకు, గుత్తి 5.40, తాడిపత్రి 6.40, యర్రగుంట్ల రాత్రి 8.00, ప్రొద్దుటూరు 8.30, జమ్ములమడుగు 8.55, బనగానపల్లె 10.05, నంద్యాలకు అర్థరాత్రి 12.05కు, విజయవాడకు మరునాడు ఉదయం 6.05 గంటలకు చేరుకుంటుంది. విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలు (నెం.17215) విజయవాడలో రాత్రి 11.10 గంటలకు బయలుదేరి నంద్యాలకు తెల్లవారుజామున 5.25 గంటలకు చేరుకుంటుంది. బనగానపల్లె 6.00, జమ్ములమడుగు 7.00, ప్రొద్దుటూరు 7.30, యర్రగుంట్ల 7.55, తాడిపత్రి 9.15, గుత్తి 10.20, అనంతపురం 11.53, ధర్మవరం మధ్యాహ్నం 1.00 గంటకు చేరుకుంటుంది. నంద్యాల - యర్రగుంట్ల మధ్య ఇప్పటివరకు డెమో రైలు మాత్రమే తిరుగుతోంది. విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలును ఈ మార్గంలో నడపాలని నిర్ణయించడంతో కర్నూలు, అనంతపురం జిల్లా వాసులకు పెద్దగా ఉపయోగకరంగా ఉండదని, పైగా మూడు గంటలు అదనపు సమయం పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కడప జిల్లావాసులు నేరుగా విజయవాడ చేరుకునేందుకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల ప్రయాణికులు రాజధాని చేరుకునేందుకు ఈరైలు అనుకూలంగా ఉంటుందని రైల్వే అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఈ రైలు కర్నూలు, అనంతపురం జిల్లా వాసులకు మాత్రమే అందుబాటులో ఉంది. మే నెల నుంచి కడప జిల్లా వాసులకు అందుబాటులోకి రానుంది.