జాతీయ వార్తలు

‘కేంద్రానికి సంబంధం లేదు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిస్థితులకు కేంద్రానికి సంబంధంలేదని కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. ఈ మేరకు అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తమిళనాడులోని తాజా రాజకీయ పరిస్థితులపై విడివిడిగా ప్రకటనలు చేశారు. ప్రస్తుత పరిస్థీతులను బట్టి తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయం తీసుకొంటారని వెంకయ్య తెలిపారు. అరుణ్ జైట్లీ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తమిళనాడు రాజకీయాలలో చట్టం తనపని తాను నిర్వహిస్తుందని, కేంద్రంలో ఎన్డీయో ప్రభుత్వం చట్టాన్ని గౌరవం ఇచ్చే ప్రభుత్వమని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. అలాగే తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను సమిక్ష చేసుకోని గవర్నర్ నిర్ణయం తీసుకోంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడు రాజకీయలలో గవర్నర్ తీసుకోనే నిర్ణయామే కీలకమైనదని బండారు వెల్లడించారు. మురళీధర్‌రావు మాట్లాడుతూ ఆ రాష్ట్రంలో సంక్షోభానికి బీజేపీకి సంబంధంలేదన్నారు. మంగళవారం సుప్రీంకోర్టు తీర్పుతో దేశంలో క్లీన్ పాలిటిక్స్ దిశలో గొప్ప ముందడుగు అని ఆయన వ్యాఖ్యానించారు.