జాతీయ వార్తలు

కుట్రల పుట్ట ‘పోయెస్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: జయలలిత ఆక్రమ ఆస్తుల కేసు తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు పలు ఆస్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సమాజంలో అవినీతి పెరిగిపోవడంపట్ల న్యాయమూర్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ, ఉన్నవాళ్లు, లేనివాళ్ల మధ్య అంతరం పెరిగిపోవడానికి ఈ అవినీతే కారణవుతోందన్నారు. అక్రమంగా సంపాదించిన సంపదను న్యాయబద్ధమైనదిగా చూపించుకోవడానికి న్యాయపరమైన చర్యలనుంచి తప్పించుకోవడానికి జయలలిత, ఆమె అనుంగు నెచ్చెలి శశికళ కలిసి ఏకంగా 34 కంపెనీలను ప్రారంభించారని, వీటిలో చాలా కంపెనీలు బూటకపు (షెల్) కంపెనీలని తీర్పు ప్రకటించిన ఇద్దరు న్యాయమూర్తులు అమితావ రాయ్, పిసి ఘోష్ తమ తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితురాలయిన అప్పటి ముఖ్యమంత్రి జయలలిత తన నెచ్చెలి శశికళకు మద్దతుగా పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారని, దీనితో ఆమె జయలలితనుంచి పొందిన అక్రమ సంపాదనతో కంపెనీల పేరుతో ఆస్తులను కొనుగోలు చేసుకుంటూ పోయారని ఇద్దరు న్యాయమూర్తులూ పేర్కొన్నారు.
శశికళ, ఆమె ఇద్దరు బంధువులు- జయలలిత దత్తపుత్రుడైన విఎన్ సుధాకరన్, శశికళ వదిన ఇళవరసి ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా పోయెస్ గార్డెన్‌లో జయలలితతోపాటే కలిసి ఉండేవారని, సామాజిక అనుబంధంతోనో, మానవీయ దృక్పథంతోనో జయలలిత వారిని తన ఇంట్లో ఉండడానికి అనుమతించలేదని, జయ ఆస్తుల కోసం నేరపూరిత కుట్రతోనే వారంతా జయ ఇంట్లో ఉన్నారని సాక్ష్యాధారాలను బట్టి స్పష్టమవుతోందని కూడా న్యాయమూర్తులు తమ తీర్పులో స్పష్టం చేశారు. ‘శశికళ స్వయంగా కొన్ని సంస్థలను ప్రారంభించి ఆస్తులను కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఆ సంస్థలు ఆస్తులను కొనుగోలు చేయడం తప్ప మరే పనీ చేయలేదు. ఈ కంపెనీలన్నీ కూడా పోయెస్ గార్డెన్ (జయ నివాసం) నుంచే పని చేస్తూ ఉండేవి. దీన్నిబట్టి ఈ విషయాలు జయలలితకు తెలియవంటే నమ్మ లేము. శశికళ, ఇతర నిందితులు చేసే పనులను ఆమె చూసీ చూడనట్లుగా వదిలేశారని కూడా అనుకోలేము. కంపెనీల ఏర్పాట్లు, సొమ్ములు ఒక ఖాతానుంచి మరో ఖాతాకు మళ్లడం ఎంతో శరవేగంగా జరిగాయి. ఒకే రోజు పది కంపెనీలు ఏర్పాటయ్యాయంటే ఈ కుట్రకు పాల్పడిన వారు ఎంత పకడ్బందీ వ్యూహంతో పని చేశారో అర్థమవుతుంది’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. జయలలిత, శశికళకు సంబంధించి ఈ ఇద్దరిలో ఒకరు మరొకరికి ఏజంటని, రెండు సంస్థల్లో భాగస్వాములని, ఇదే కాకుండా శశికళ జయలలితకు అటార్నీ, సహ కుట్రదారు అని కూడా సాక్ష్యాధారాలనుబట్టి స్పష్టమవుతోందని న్యాయమూర్తులు పేర్కొన్నారు.