జాతీయ వార్తలు

పరివర్తనకు ప్రతీకలు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ఐఏఎస్, ఐపిఎస్ తదితర సివిల్ సర్వీస్ అధికారులు దేశాభివృద్ధికి పునరంకితం కావటం ద్వారా తమ పాత్రకు కొత్త నిర్వచనం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. ఎవరికి వారుగా కాక ఒక టీమ్‌గా పని చేయాలని, మార్పునకు ప్రతీకలుగా నిలవాలని ఆయన సూచించారు. గురువారం విజ్ఞాన్ భవన్‌లో సివిల్ సర్వీస్ దినోత్సవం సందర్భంగా సివిల్ సర్వీస్ అధికారులను ఉద్దేశించి ప్రధా ని ప్రసంగిస్తూ, సివిల్ సర్వీస్ అధికారులు సమాజంలో మార్పు తెచ్చేందుకు కొత్త, కొత్త ప్రయోగాలు చేయాలని సూచించారు. ‘కొంతమంది ఎవరికి వారుగా పనిచేస్తారు. అయితే ఎవరికి వారుగాకన్నా ఒక టీమ్‌గా పని చేసినప్పుడు ఎక్కువ ఫలితాలు వస్తాయి. జాతి నిర్మాణం కోసం ఒంటెత్తుపోకడనుంచి బైటికి వచ్చి ఒక టీమ్‌గా పని చేయాల్సిన అవసరం ఉంది’ అని ఆయన అన్నారు. దేశాభివృద్ధికి ప్రతి ఒక్క రూ తమ వంతు కృషి చేసేందుకు అనువైన వాతావరణాన్ని సివిల్ సర్వీస్ అధికారులు సృష్టించాలన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరు కూడా మార్పునకు ప్రతినిధులుగా మారాలంటూ సివిల్ సర్వీస్ అధికారులు కేవలం పరిపాలకులుగా ఉం టూ అన్నింటిని అదుపు చేస్తామంటే కుదరదని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సర్వతోముఖాభివృద్ధిని సా ధించాలంటే ప్రతి జిల్లాలో ప్రజలకు విశ్వాసం కల్పించాలని, ప్రభుత్వ విశ్వసనీయతను పెంచాలని ఆయన సూచించారు. అన్ని అడ్డంకులను అధిగమించి అభివృద్ధి సాధించగలగాలని ప్రధాన మంత్రి చెప్పారు. 125 కోట్ల మంది ప్రజల శక్తియుక్తులతో దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలంటూ, అందరూ కలిసి కట్టుగా విరామం లేకుండా కృషి చేస్తేనే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
జిల్లా కలెక్టర్లు నీటి పొదుపు, నీటి సంరక్షణకు తీవ్రంగా కృషి చేయవలసి తరుణం ఆసన్నమైందంటూ ఈ లక్ష్య సాధన కోసం ప్రజలను భాగస్వాములను చేయాలని మోదీ చెప్పారు. దేశంలో సగటుకంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులను అధిగమించేందుకు ప్రజలతో కలిసి పని చేయాలని నరేంద్ర మోదీ సూచించారు. దేశాభివృద్ధిని సాధించేందుకు అన్ని రాష్ట్రాలు కూడా పోటీ సహకార సమాఖ్య విధానాన్ని అవలంబించాలని ప్రధాన మంత్రి ప్రతిపాదించారు. ఆయా రాష్ట్రాలు అభివృద్ధి సాధన కోసం పోటీ పడుతూనే పరస్పరం సహకారం అందించుకోవాలన్నారు. సివిల్ సర్వీస్ అధికారులు బలం, అంకిత భావంతో పని చేయాలని, మీరు సహేతుక, అనుకూల దృక్పథం, దృష్టితో పని చేస్తే దేశాన్ని పూర్తిగా మార్చివేయగలుగుతారని నరేంద్ర మోదీ చెప్పారు. పరిపాలనకు సంబంధించిన కీలక అంశాలను చూడడం కోసం తన చొరవతో ఏర్పడ్డ సెక్రటరీల కమిటీల గురించి ప్రధాని మాట్లాడుతూ, ఈ అధికారులంతా ఆఫీసు పని గంటల తర్వాత, సెలవు రోజుల్లో స్వచ్ఛందంగా పని చేస్తారన్నారు. ఈ బృందాలు ఎన్నో కొత్త ఆలోచనలను అందించాయని, పది వేల పని గంటలకన్నా ఎక్కువ సమయాన్ని వారు దీనికోసం కేటాయించారని చెప్పారు. వివిధ రంగాల్లో బహుమతులను గెలుచుకున్న అధికారులను అభినందిస్తూ ఇది ఇతర అధికారులకు ప్రో త్సాహకంగా పని చేస్తుందని మోదీ చెప్పారు. సివిల్ సర్వీస్ అధికారులు తననెప్పుడూ నిరాశపరచలేదని ప్రధాని వ్యాఖ్యానించారు. అధికారులతో గట్టిగా మాట్లాడవలసిన అవసరం తనకెప్పుడు రాలేదని, ఎలాంటి చేదు అనుభవం లేదన్నారు. ప్రజా పరిపాలనలో ప్రతిభను కనబరిచిన వారికి ప్రధాన మంత్రి ప్రతిభా అవార్డులను ఆయన ఆయా జిల్లాల కలెక్టర్లుకు అందజేశారు.

చిత్రం న్యూఢిల్లీలో సివిల్ సర్వీస్ దినోత్సవం సందర్భంగా గురువారం జరిగిన కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాని మోదీ