జాతీయ వార్తలు

ప్రశాంతంగా రెండో దశ పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో/డెహ్రాడూన్, ఫిబ్రవరి 15: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో బుధవారం జరిగిన పోలింగ్‌లో భారీగానే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 65 శాతం, ఉత్తరాఖండ్‌లో 68 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ రాత్రి పొద్దుపోయిన తర్వాత స్పష్టం చేసింది. యుపిలో మొత్తం 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిందని, ఇవన్నీ కూడా అత్యంత సునిశితమైన స్థానాలేనని స్పష్టం చేసింది. ఓటర్లు భారీఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలిరావడాన్ని బట్టి దీన్నో ప్రజాస్వామ్య ఉత్సవంగానే భావించాల్సి వచ్చిందని ఇసి స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌లోని 69 పోలింగ్ కేంద్రాలకు కూడా ఓటర్లు భారీగానే తరలివచ్చారని ఇసి తెలిపింది. మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి వుండగా బిఎస్‌పి అభ్యర్థి మరణించడంతో ఎన్నిక వాయిదా పడింది.
యుపిలో నేడు జరిగిన 68 స్థానాలు అన్ని పార్టీలకు కీలకమే. 2012లో జరిగిన ఎన్నికల్లో అధికార సమాజ్‌వాది పార్టీ 34 సీట్లను ఈ ప్రాంతాల్లోనే గెలుచుకుంది. అప్పట్లో బిఎస్‌పికి 18, బిజెపికి 10 స్థానాలే వచ్చాయి. కాంగ్రెస్‌కు కేవలం మూడు సీట్లే దక్కాయి. నేటి పోలింగ్‌లో 62మంది మహిళలు సహా 721మంది అభ్యర్థులు పోటీపడ్డారు. పోటీలో ఉన్న ప్రముఖుల్లో రాష్టమ్రంత్రి ఆజంఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్ ఆజమ్, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద తదితరులు ఉన్నారు.