జాతీయ వార్తలు

మనకి ఇక సాటిలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 15: అత్యధిక సంఖ్యలో 104 ఉపగ్రహాల ప్రయోగంతో భారత్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించిందని ఇస్రో సంస్థ చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్ అన్నారు. బుధవారం పిఎస్‌ఎల్‌వి-సి 37 ప్రయోగ విజయం అనంతరం షార్‌లోని మీడియా సెంటర్‌లో శాస్తవ్రేత్తలతో కలసి ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధిక ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపి నూతన సాంకేతిక విధాన ప్రయోగాల్లో తొలిమెట్టులోనే ఇస్రో ఎంతో ఘనత సాధించిందన్నారు. ఇదంతా శాస్తవ్రేత్తల సమష్టి కృషి ఫలితమేనని స్పష్టం చేశారు. ఈ ప్రయోగం ద్వారా ప్రపంచ దేశాలు కూడా మన రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను పంపేందుకు క్యూ కడతాయన్నారు. ప్రయోగం ఒకటే అయినా వంద ప్రయోగాలతో సమానమన్నారు. ఎందుకంటే ఒక రాకెట్ ద్వారా కక్ష్యలోకి ఇన్ని ఉపగ్రహాలను ఇంతవరకు ఎవరూ పంపలేదని, ఈ ప్రయోగం ద్వారా 104 ఉపగ్రహాలను విజయవంతంగా పంపామన్నారు. దీని వల్ల ఖర్చు ఆదాతో పాటు మరిన్ని సేవలకు సంబంధించిన ఉపగ్రహాలను తక్కువ కాలంలోనే ప్రయోగించేందుకు వీలుంటుందన్నారు. శాస్తవ్రేత్తల పనితీరు వల్లే రోజురోజుకు విజయాలు పెరుగుతున్నాయన్నారు. ప్రపంచంలో ఉన్న దేశాలు కూడా పిఎస్‌ఎల్‌వి వాహక నౌక పైనే ఎక్కువ నమ్మకం పెట్టుకొంటున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇదే తరహా ప్రయోగాలను షార్ నుండి నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ ప్రయోగం ఇస్రోకు పెద్ద సవాల్‌గా మారినా అంతిమంగా విజయం సాధించామన్నారు. వివిధ ఒప్పందాల మేరకే ఉపగ్రహాలు తయారు చేస్తున్నామని ఇప్పటి వరకు రెండు దేశాలకు సంబంధించిన 180 విదేశీ ఉపగ్రహాలు పిఎస్‌ఎల్‌వి వాహక నౌక ద్వారా పంపించి వరుస విజయాలు సాధించామని గుర్తు చేశారు. పిఎస్‌ఎస్‌వి-సి 37 ద్వారా కార్టోశాట్-2డి ఉపగ్రహంతో పాటు 101విదేశీ ఉపగ్రహాలు, రోదసీలోకి విజయవంతంగా పంపామన్నారు. ఈ ఏడాది సార్క్ దేశాలకు చెందిన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు నిర్ణయం తీసుకొన్నామన్నారు. అదే విధంగా మార్చిలో జిఎస్‌ఎల్‌వి-మార్క్ 3 ప్రయోగంతో ఈ ఏడాది మరో రెండు ప్రయోగాలు ఉంటాయన్నారు. జీశాట్ 9,జీశాట్ 18 ప్రయోగాలు కూడా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబరు మాసం నుండి వచ్చే ఏడాది మార్చి లోపు చంద్రయాన్-2, రెండో మామ్ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు నిర్ణయం తీసుకొన్నామన్నారు.
షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్ మాట్లాడుతూ గత ఏడాది అధికంగా 9ప్రయోగాల చేపట్టామన్నారు. అదే తరహాలో ఈ ఏడాది ప్రయోగాలు ఉంటాయన్నారు. ఉపగ్రహ డైరెక్టర్ సదానందరావు మాట్లాడుతూ ఈ ఉపగ్రహాన్ని తక్కువ సమయంలో రూపకల్పన చేశామన్నారు. దీంతో పాటు విదేశాలకు చెందిన 101 ఉపగ్రహాలు పంపి విజయం సాధించడంతో ఇస్రో కీర్తిప్రతిష్టలు ప్రపంచ దేశాలకు తెలిశాయన్నారు. ఈ ప్రయోగం మనకే కాకుండా విదేశాలకూ ఎంతో ఉపయోగమన్నారు.