జాతీయ వార్తలు

రాకెట్ ప్రయోగం జరిగిందిలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 15: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (షార్)లో బుధవారం పిఎస్‌ఎల్‌వి సి- 37 రాకెట్ ప్రయోగం ఆద్యంతం ఒక విధమైన ఉద్వేగంతో సాగింది. ఇస్రో ఎంతోప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ రాకెట్ ప్రయోగం ఇస్రోను రోదసిలో అగ్రరాజ్యాలకు దీటుగా నిలిపింది. పిఎస్‌ఎల్‌వి రాకెట్ ప్రయోగం వివిధ దశల్లో 104 ఉపగ్రహాలను వివిధ కక్ష్యల్లో విడిచిపెట్టింది. మంగళవారం ఉదయం 5:28గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 28 గంటలపాటు నిర్విఘ్నంగా కొనసాగింది. బుధవారం ఉదయం 9:28గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి ఎరుపు, నారింజ రంగుల్లో నిప్పులు చిమ్ముకుంటూ పిఎస్‌ఎల్‌వి-సి 37 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ నింగికెగసిన అనంతరం చివరిలో కొంత ఉత్కంఠ నెలకొన్నప్పటికీ వరుసగా 38వ విజయాన్ని నమోదు చేస్తూ పిఎస్‌ఎల్‌వి-సి 37 104 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రోలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పిఎస్‌ఎల్‌వి-సి 37 వాహక నౌక ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన కార్టోశాట్-2డి ఉపగ్రహాన్ని మొదట 17:30నిమిషాలకు భూమికి 510కి.మీ ఎత్తులో సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అనంతరం ఇస్రోకు చెందిన రెండు నానో ఉపగ్రహాలు ఐఎన్‌ఎస్-1ఎ 17:39నిమిషాలకు, ఐఎన్‌ఎస్-1బి 17:40 నిమిషాలకు కక్ష్యలోకి చేర్చింది. అనంతరం 18.40నిమిషాలకు ప్రథమ పెట్టెల్లో అమర్చిన అమెరికాకు చెందిన విదేశీ నానో ఉపగ్రహాలు కక్ష్యలోకి విజయవంతంగా చేరాయి. అక్కడ నుండి మరో ఎనిమిది నిమిషాల పాటు రాకెట్‌లో చివరి భాగంలో అమర్చిన బ్యాటరీతో రాకెట్ అంతరిక్షంలో కొంత దూరం తిరిగి అక్కడ ఏవైనా శకలాలు ఈ ఉపగ్రహాలకు అడ్డు తగులుతున్నాయో లేదా పరిశీలించే విధంగా శాస్తవ్రేత్తలు రూపొందించారు. రాకెట్ బ్యాటరీ రీచార్జి ఉన్నంత వరకు అంతరిక్షంలో తిరిగి 30 నిమిషాల్లో రెండో విభాగ పెట్టెల్లో అమర్చిన విదేశీ ఉపగ్రహాలన్నింటిని ఒకసారిగా వివిధ కక్ష్యలోకి ఒకదాని తరువాత ఒకటి ఢీ కొనకుండా రోదసీలోకి చేర్చారు. వీటిలో ప్రధానమైన ఉపగ్రహమైన కార్టోశాట్-2డి దీని బరువు 714కిలోలు, మొత్తం ఉపగ్రహాల బరువు 1378కిలోలు. అంతేకాకుండా ఈ ప్రయోగానికి ఐఆర్‌ఎన్‌ఎస్ నావిగేషన్ సేవలను తీసుకొన్నారు. మునె్నన్నడూ లేని విధంగా ఈ రాకెట్‌లో అన్ని భాగాల్లో కెమెరాలు అమర్చి ప్రతి సంకేతాన్ని ఛాయా చిత్రాలు తీసే విధంగా రూపొందించారు. చివరికి అంతరిక్షంలో రాకెట్‌లో విడిపోయే చిన్నచిన్న శకలాలను కూడా తీసే విధంగా కెమెరాలను అమర్చారు. పిఎస్‌ఎల్‌వి-సి 37 రాకెట్ భూమి నుండి నింగికి ఎగిరిన అనంతరం తన మూడు దశలను సునాయాసంగా పూర్తిచేసి నాలుగో దశలో రాకెట్‌లో ఉన్న ఉపగ్రహాలను ఒకదాని తరువాత ఒక్కొక్కటిగా విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది.
నాలుగు దశల్లో రాకెట్ పయనం
ప్రయోగ సమయంలో 320టన్నుల బరువు44.4మీటర్ల ఎత్తున్న పిఎస్‌ఎల్‌వి రాకెట్ తన నాలుగు దశలను సునాయసంగా పూర్తిచేసుకొని భూమికి 525 కిలోమీటర్ల దూరంలో మన దేశ కార్టోశాట్-2డి ఉపగ్రహాన్ని 17:30నిమిషాలకు కక్ష్యలో చేర్చింది. అనంతరం ఇస్రో బుల్లి ఉపగ్రహాలతో పాటు విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా రోదసీలోకి భూమధ్య రేఖాతలానికి 97.46డిగ్రీల వాలుతో కక్ష్యలోకి శాస్తవ్రేత్తలు ప్రవేశపెట్టారు. మిషన్ కంట్రోల్ సెంటర్ నుండి రాకెట్ గమనాన్ని శాస్తవ్రేత్తలు నిరంతరం పర్యవేక్షించారు. రాకెట్ భూమి నుండి నింగిలోకి ఎగిరిన తరువాత రాకెట్ నాలుగు దశలను ఒకదాని తరువాత ఒకటి నిర్దేశించిన సమయానికే తన నాలుగు దశలను పూర్తిచేసుకొని రాకెట్ నుండి ఉపగ్రహం విడిపోయి కక్ష్యలోకి దూసుకెళ్లాయి. అక్కడే రాకెట్ గమనాన్ని సూపర్ కంప్యూటర్ల ద్వారా గమనిస్తున్న రేంజ్ ఆపరేషన్ సిబ్బంది రాకెట్ నాలుగో దశ పూర్తిచేసినట్లు నిర్ధారించడంతో శాస్తవ్రేత్తల ఆనందానికి ఆవధులు లేకుండా పోయింది.

దశలవారీగా
విడిపోయిందిలా..

రాకెట్ భూ భాగం నుంచి నింగిలోకి ఎగిరినంరతం తన అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసి ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది. కౌంట్‌డౌన్ పూర్తయ్యినంతరం రాకెట్ భూమి నుండి నిప్పులు చిమ్ముకుంటూ నింగివైపు కదిలింది. తన మొదటి దశ 1:50నిమిషాలకు 67 కి.మీ ఎత్తుకు చేర్చి తొలి దశ మోటారు రాకెట్ నుంచి విడిపోయింది. రెండో దశ మోటారు అంటుకొని సెకనుకు 2165కి.మీ వేగంతో 4:22నిమిషాలకు 218కి.మీ ఎత్తుకు చేరినంతరం రెండో దశ మోటారు విడిపోయింది. అక్కడ నుంచి మూడో దశ 8:12నిమిషాలకు 428కి.మీ ఎత్తుకు చేరినంతరం నాలుగో దశ ప్రారంభమై 16:47నిమిషాలకు 509కి.మీ ఎత్తుకు చేరింది. అక్కడ నుండి రాకెట్ చివరి భాగంలో ఉన్న ఉపగ్రహాలను మొదట కార్టోశాట్-2డి ఉపగ్రహాన్ని 17:30 నిమిషాలకు 510కి.మీ ఎత్తులో విడిపోయింది. అనంతరం మరో రెండు చిన్న ఉపగ్రహాలు రెండు నిమిషాల వ్యవధిలో 510కి.మీ ఎత్తులో విడిపోయాయి. అనంతరం 511కి.మీ ఎత్తులో ప్రథమ దశలో ఉన్న విదేశీ ఉపగ్రహాలు విడిపోయాయి. అనంతరం రాకెట్ 525కి.మీ ఎత్తుకు పోయిన అనంతరం 30నిమిషాలకు రెండో పెట్టెలో ఉన్న విదేశీ ఉపగ్రహాలు రాకెట్ నుండి విడిపోయి కక్ష్యలోకి చేరాయి. దీని వల్ల ఇస్రో వాణిజ్య పరంగా మరో ముందడుగు వేసింది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా వంటి ఆగ్రదేశాలు కూడా ఇలాంటి ప్రయోగాలు చేపట్టలేదు. మన శాస్తవ్రేత్తలు ఇందుకు పూనుకొని సరికొత్త రికార్డు ప్రయోగాలకు శ్రీకారం చుట్టడం విశేషం. దీంతో అత్యధిక ఉపగ్రహాలను పంపిన దేశంగా భారత్ ముందు స్థానంలో నిలిచింది. మన తరువాత రష్యా రెండో స్థానం, అమెరికా మూడో స్థానంలో ఉంది. మిషన్ కంట్రోల్ సెంటర్‌లో సూపర్ కంప్యూటర్ల ద్వారా రాకెట్ గమనాన్ని చూస్తున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎఎస్.కిరణ్‌కుమార్ రాకెట్ నాలుగు దశలు పూర్తయి ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరిన అనంతరం పిఎస్‌ఎల్‌వి-సి 37 విజయాన్ని అధికారికంగా ప్రకటించి శాస్తవ్రేత్తలతో ఆనందాన్ని పంచుకొన్ని హర్షం వ్యక్తం చేశారు. ఎంసిసి నుంచే ఆయన నేరుగా మాట్లాడుతూ ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలు పంపి విజయం సాధించిన ఘనత కొత్త రికార్డు ఇస్రోకు దక్కిందన్నారు. ఈ విజయం శాస్తవ్రేత్తల సమష్టికృషి భవిష్యత్‌లో ఇలాంటి ప్రయోగాలే కాకుండా భారీ ప్రయోగాలు చేపడతామన్నారు. అధిక ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా పంపేందుకు ఇది తొలిమెట్టులాంటిదన్నారు. స్కాట్‌శాట్-2డి ఉపగ్రహం రిమోట్ సెన్సింగ్ దూర పరిశీలన ఉపగ్రహమన్నారు. ఇది ఐదేళ్లపాటు సేవలు అందించనున్నట్లు శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.