జాతీయ వార్తలు

వ్యవసాయానికీ ‘ఉపాధి హామీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16:ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయరంగానికి అనుసంధానించాలని తెలంగాణ వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. భూసార పరీక్షలు సైతం క్షేత్రస్థాయికి అనుగుణంగా ఉండేలా మార్పులు చేయాలని, తెలంగాణకు మినీ భూసార పరీక్ష కేంద్రాలను మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, పంటల బీమా, పంట నష్ట పరిహారం వంటివి ‘రైతు యూనిట్‌గా’ చేయాలని కోరారు. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌తో పోచారం గురువారం భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి పంటల బీమా పథకంలో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసినప్పడే ఈ పథకం ద్వారా ఆశించిన ఫలితాన్ని రైతులకు అందించగలమని సూచించినట్టు తెలిపారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినందున ప్రతి జిల్లాకు ఒక కృషి విజ్ఞాన కేంద్రాన్ని మంజూరు చేయాలని కేంద్రమంత్రిని కోరినట్టు తెలిపారు. తెలంగాణలో పత్తి సాగు గణనీయంగా ఉన్నందువల్ల అఖిల భారత సమన్వయ పరిశోధన ప్రాజెక్టును వరంగల్‌లో నెలకొల్పాలని కోరారు. తమ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు మంత్రి పొచారం తెలిపారు.