జాతీయ వార్తలు

‘ఆర్థిక దిగ్బంధం’చుట్టూ మణిపూర్ రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్, ఫిబ్రవరి 16: వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్న మణిపూర్‌లో రాజకీయాలు ‘ఆర్థిక దిగ్బంధం’ చుట్టూ తిరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని కీలకంగా భావిస్తూ తమకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సరిహద్దు రాష్ట్రానికి జీవనాధారమైన జాతీయ రహదారి-2, జాతీయ రహదారి-37లను దిగ్బంధించడంతో సరుకు రవాణా నిలిచిపోయి ప్రజల జీవనం దుర్భరంగా మారడం వల్ల ఈ అంశం మిగతా నోట్ల రద్దు, అవినీతి, ప్రభుత్వ వ్యతిరేకత వంటి అంశాలను వెనక్కి నెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏడు జిల్లాలను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ యునైటెడ్ నాగా కౌన్సిల్ (యుఎన్‌సి) నిరుడు నవంబర్ ఒకటి నుంచి నిరవధిక ‘ఆర్థిక దిగ్బంధం’ విధిస్తోంది. అయితే పరిపాలనను మెరుగు పరచడానికే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఆర్థిక దిగ్బంధం కొనసాగించేట్లుగా యుఎన్‌సిని బిజెపి ప్రోత్సహిస్తోందని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగినంతగా సహకరించడం లేదని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. బిజెపి కపటబుద్ధితో ఆర్థిక దిగ్బంధనాన్ని సమర్థిస్తోందని, యుఎన్‌సితో చేతులు కలిపిందని మండిపడుతోంది. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను సృష్టించేందుకు కేంద్రం సహకరించడం లేదని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కెహెచ్ జోయ్‌కిషన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఓక్రం ఇబోబి ప్రభుత్వం తెగల ఆధారంగా జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించిందని, ఆర్థిక దిగ్బంధం కారణంగా లోయలో తలెత్తే తెగల భావోద్వేగాల నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తోందని బిజెపి ఎదురుదాడికి దిగింది.