జాతీయ వార్తలు

శశికళ ఎంపిక అక్రమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: అన్నా డిఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక అక్రమంగా జరిగిందంటూ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అన్నా డిఎంకె సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.మైత్రేయన్ నాయకత్వంలో పది మంది పార్టీ ఎంపీలు గురువారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు. ఎనిమిది మంది లోక్‌సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లారు. శశికళ వర్గానికి పార్టీ ఎన్నికల చిహ్నమైన రెండాకుల గుర్తును కేటాయించకూడదని కూడా వారు కేంద్ర ఎన్నికల సంఘానికి విజప్తి చేశారు. అన్నా డిఎంకె పార్టీ నియమావళి ప్రకారం శశికళ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యేందుకు వీలు లేదని వారు కేంద్ర ఎన్నికల సంఘం ముందు వాదించారు. శశికళ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక కావటం పార్టీ నియమావళికి విరుద్ధమంటూ అన్నా డిఎంకె ప్రిసీడియం అధ్యక్షుడు మధుసూదన్ రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప విడిగా ఇచ్చిన వినతిపత్రాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం రెండు వినతిపత్రాలను పరిశీలించిన తరువాతనే ఒక నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదులపై తీసుకునే నిర్ణయంపై పన్నీర్ సెల్వం, మధుసూదన్ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.