జాతీయ వార్తలు

మళ్లీ రాష్టప్రతి పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఉత్తరాఖండ్‌లో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న రాజకీయ డ్రామా సరికొత్త మలుపు తిరిగింది. రాష్టప్రతి పాలనను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై 27వరకూ స్టే విధిస్తూ సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. అలాగే, హరీశ్ రావత్ సర్కారు పునరుద్ధరణకూ బ్రేకు వేసింది. ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుతో కంగుతిన్న కేంద్రానికి సుప్రీం కోర్టు తాజా తీర్పు ఊరట కలిగించడంతో పాటు రద్దయిన రాష్టప్రతి పాలన మళ్లీ అమలులోకి వచ్చింది. అయితే తదుపరి విచారణను 27వరకూ వాయిదా వేసిన కోర్టు ఆ లోగా రాష్టప్రతి పాలనను ఎత్తివేయడానికి వీల్లేదంటూ కేంద్రం నుంచి హామీ తీసుకుంది. ఈ మేరకు అటార్నీ జనరల్ రోహద్గీ చేసిన ప్రకటనను రికార్డు చేసింది. హైకోర్టు తీర్పు పాఠం తమకు అందనందున ఇరు పక్షాలకు సమతూకంతో కూడిన అవకాశాన్ని అందించే ఉద్దేశంతోనే హైకోర్టు తీర్పు అమలును నిలిపివేస్తున్నామని సుప్రీం కోర్టు ప్రకటించింది. ఈ నెల 27వరకూ ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన అమలులో ఉంటుందని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, శివ్‌కీర్తి సింగ్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ నెల 26లోగా సంబంధిత పక్షాలకు తీర్పు పాఠాల్ని అందించాలని, అలాగే అదే రోజూ తమకు నివేదించాలని హైకోర్టును ఆదేశించింది. రాష్టప్రతి పాలనను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన సవాలు పిటిషన్‌ను పురస్కరించుకుని హరీశ్ రావత్, ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపింది. కేంద్రం తరపున తమ వాదనలు వినిపించిన రోహద్గీ, మరో సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వేలు రాష్ట్ర హైకోర్టు తీర్పును నిలిపివేయాలని సుప్రీం కోర్టును కోరారు. హైకోర్టు తీర్పు ఓ వ్యక్తికి (హరీశ్ రావత్)కు ప్రయోజనం కలుగుతోందదని, అందుకు సంబంధించిన పాఠం లేకపోవడం వల్ల మరో పక్షం (కేంద్రం) తీవ్ర నష్టానికి గురవుతోందని రోహద్గీ వాదించారు. రావత్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, కపిల్ సిబల్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ హైకోర్టు తీర్పు అమలును నిలిపివేయడానికి వీల్లేదని తెలిపారు. హైకోర్టు తీర్పు అమలుపై స్టే విధించడమంటే మళ్లీ రాష్టప్రతి పాలనను పునరుద్ధరించడమే అవుతుందని సిబల్ అన్నారు ఇరు పక్షాల వాదనను విన్న సుప్రీం న్యాయమూర్తులు ఎవరికీ నష్టం వాటిల్లకుండా తాము సమతూకంతో కూడిన రీతిలో వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు. తీర్పు వెలువరించిన హైకోర్టు వెంటనే సంతకంతో కూడిన కాపీలను సంబంధిత పార్టీలకు అందించి ఉండాల్సిందని, అప్పుడు వారికి అప్పీలు చేసుకోవడానికి వీలు కలుగడమే కాకుండా తమకూ సరైన రీతిలో న్యాయం చేయడానికి వీలుండేదని న్యాయమూర్తి శివకీర్తి సింగ్ పేర్కొన్నారు. ‘నేను ఉత్తరాఖండ్ హైకోర్టులో ఉండి ఉంటే..తీర్పు అమలుకు కొన్ని రోజులు ఆగి ఉండేవాడ్నే’నని ఆయన అన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, రాజ్యాంగ బెంచి పరిశీలనకు దీన్ని నివేదించాల్సిన అవసరం ఎంతో ఉందని సుప్రీం బెంచి తెలిపింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు గుణదోషాలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని, దేశంలోని ఏ రాష్ట్రానికైనా ఇది చాలా కీలకమైన పరిణామమని వ్యాఖ్యానించింది.