జాతీయ వార్తలు

రాజ్యసభకు సుబ్రహ్మణ్యస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: బిజెపి సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి, మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధు, ఒలింపిక్ గోల్డ్‌మెడలిస్టు మేరీకోమ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ సిఫార్సులకు రాష్టప్రతి ఆమోదముద్ర వేశారు. ప్రముఖ సినీ రచయిత సలీమ్‌ఖాన్, మలయాళ నటుడు సురేష్ గోపిలను కూడా పెద్దల సభ ఎంపికయ్యారు. రాజ్యసభలో ఖాళీ స్థానాలు భర్తీ చేయాలని అధికార బిజెపి నిర్ణయించింది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందే ఈ ప్రక్రియ పూర్తిచేయాలని భావించి ప్రక్రియ ప్రారంభించింది. నెహ్రూ కుటుంబాన్ని తూర్పారాపట్టే స్వామి, మలయాళ నటుడు సురేష్ గోపి, జర్నలిస్టు స్వపన్ దాశ్‌గుప్తా, బాక్సింగ్‌లో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్టు మేరీకోమ్, ఆర్థిక వేత్త నరేంద్ర జాదవ్, మాజీ ఎంపీ నవ్‌జోతి సింగ్ సిద్ధు, సలీమ్‌ఖాన్‌లకు రాజ్యసభ సభ్వతం లభించింది. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో 12 మందిని నామినేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఏడు ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంతో వాగ్ధాటి గల సుబ్రహ్మణ్యస్వామిని రాజ్యసభకు పంపడం ద్వారా ఆయన సేవలను సద్వినియోగం చేసుకోవాలని బిజెపి భావిస్తోంది. మేరీకోమ్, నవ్‌జోత్ సింగ్ సిద్ధుల పేర్లను ప్రధాని కార్యాలయమే ఖరారు చేసింది. ‘జాతీయ అంశాలను సభలో ప్రస్తావించేందుకు ఎంపీ పదవి ఎంతో దోహదపడుతుంది. అనేక ప్రాధాన్యత అంశాలను లేవనెత్తుతా’అని స్వామి ట్విట్టర్‌లో వెల్లడించారు. మద్దతుదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సాహిత్యం, సైన్స్,కళలు, సామాజిక రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులను ఎంపిక చేసి వారి పేర్లను కేంద్రం రాష్టప్రతికి సిఫార్సు చేస్తుంటుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త అను అఘా, న్యాయవాది కె పరాశరన్, నటి రేఖ, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సీనియర్ అడ్వొకేట్ కెటిఎస్ తులసిలు యుపిఏ హయాంలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.