జాతీయ వార్తలు

ఉత్తమ అధికారులకు పిఎం ప్రతిభా పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో సమర్థవంతంగా పనిచేసే అధికారులను అవార్డులు అందజేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదు పథకాలు అమలులో సమర్థవంతంగా పనిచేసే అధికారులను అవార్డులకు ఎంపిక చేస్తారు. ప్రధాన మంత్రి కృషి సంచయి యోజన (పిఎంకెఎస్‌వై), ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై), దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన (డిడియుజిజెవై), ఇ-నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఇ-ఎన్‌ఎఎం), స్టాండప్ ఇండియా/స్టార్టప్ పథకాల విజయవంతానికి కృషి చేసే వారిని అవార్డులకు ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ‘ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్’ పేరుతో అధికారులను సత్కరిస్తారు. ప్రాధాన్యత కార్యక్రమం కేటగిరిలో గరిష్ఠంగా 15 అవార్డులు, ఇన్నోవేషన్ కేటగిరి కింద రెండు అవార్డులు ఇవ్వనున్నారు.