జాతీయ వార్తలు

మహా కమల వికాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 23: ముంబయి మహానగరంతో పాటుగా మహారాష్టల్రోని మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని విజయాలను నమోదు చేసింది. దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన బృహన్ముంబయి కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో బిజెపి, శివసేన పార్టీలు నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ పడి స్థానాలను గెలుచుకొన్నాయి. 224 స్థానాలున్న కార్పొరేషన్‌లో ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన 84 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ భారీగా లాభపడింది మాత్రం భారతీయ జనతా పార్టీయే. అయిదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో 31 స్థానాలు మాత్రమే గెలుచుకున్న ఆ పార్టీ ఇప్పుడు ఏకంగా 82 స్థానాలను గెలుచుకోవడం గమనార్హం. మంగళవారం పోలింగ్ జరగ్గా, గురువారం ఫలితాలను ప్రకటించారు. గత ఇరవై ఏళ్లుగా ముంబయి కార్పొరేషన్ శివసేన చేతిలోనే ఉంది. అలాంటి సేన కంచుకోటను దెబ్బతీసినందుకు ఇది నిజంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యక్తిగత విజయంగానే భావించాలి. ఎన్నికల్లో పొత్తుకు మిత్రపక్షమైన శివసేన నిరాకరించడంతో ఒంటరిగానే బరిలోకి దిగిన బిజెపి ఇంతటి ఘన విజయం సాధిస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. అంతేకాదు, ఎన్నికలు జరిగిన రాష్ట్రంలోని మరో 9 కార్పొరేషన్లలో ఎనిమిదింటిని ఆ పార్టీ హస్తగతం చేసుకునే దిశగా సాగుతోంది. పుణె కార్పొరేషన్‌ను ఎన్‌సిపినుంచి దక్కించుకున్న బిజెపి నాసిక్, పింప్రి-చించ్వాడ్, అకోలా, అమరావతి, నాగపూర్, సోలాపూర్, ఉల్లాస్ నగర్ మున్సిపాలిటీల్లోను మిగతా పార్టీలకన్నా ఎంతో ముందంజలో ఉంది. ముంబయిలో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేన పొరుగున ఉన్న ఠాణెలోను ముందంజలో నిలిచింది.
ఇది ఊహించని విజయం అని, ఇంతటి భారీ విజయాన్ని అందించిన మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ ఫడ్నవిస్ అన్నారు. కాగా, గత ఎన్నికల్లో ముంబయి కార్పొరేషన్‌లో 51 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి 31 సీట్లకే పరిమితం కాగా, శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి 7, రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) 6 స్థానాలను గెలుచుకున్నాయి. అయితే మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైనన్ని స్థానాలు బిజెపి, శివసేన పార్టీలు రెండింటికీ దక్కక పోవడంతో ఎన్నికలకు ముందు విడిపోయిన ఆ రెండు పార్టీలు మళ్లీ చేతులు కలుపుతాయా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. అలా కాని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది కీలకంగా మారింది.
మజ్లిస్ బోణీ
కాగా, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ 3 స్థానాలను గెలుచుకొని తొలిసారిగా ముంబయి నగర కార్పొరేషన్‌లో అడుగుపెట్టబోతోంది. తొలిసారిగా ముంబయి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన ఈ పార్టీ ప్రధానంగా ముస్లింలు అదిక సంఖ్యలో ఉండే ప్రాంతాల్లో 69 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఆ పార్టీ నిలబెట్టిన 9 మంది ముస్లిమేతర అభ్యర్థుల్లో మూడుసార్లు విజయం ధించిన కాంగ్రెస్ కార్పొరేటర్ వకారున్నీసా అన్సారీ కూడా ఉన్నారు.

చిత్రం..కార్పొరేషన్ ఫలితాలతో బిజెపి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు