జాతీయ వార్తలు

వారణాసి కేంద్రంగా కమలం జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: భారతీయ జనతా పార్టీని ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి తీసుకు రావడానికి వారణాసి నియోజకవర్గం కేంద్రంగా ఆ పార్టీ పెద్ద నాయకులు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్న ఈ నియోజకవర్గం కేంద్రంగా ఇప్పటి వరకు జరిగిన నాలుగు విడతల పోలింగ్‌కు విస్తృతంగా ప్రచారం చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, అతని కీలక అనుచరులు ఇప్పుడు మిగతా మిగిలి ఉన్న మూడు విడతల్లోనూ ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలలో మిగతా 141 నియోజకవర్గాలకు ఈ నెల 27, మార్చి 4, 8 తేదీలలో పోలింగ్ జరుగనుంది. ఇప్పటి వరకు పోలింగ్ జరిగిన ప్రాంతాలతో పోలిస్తే పోలింగ్ జరుగవలసి ఉన్న తూర్పు ప్రాంతంలో కుల సమీకరణాలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని బిజెపి నేతలు భావిస్తున్నారు. తమ పార్టీకి ఉన్న సానుకూల అంశాలను తాము గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకోవలసి ఉందని వారు పేర్కొన్నారు. ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్నందున కొన్ని ఓట్లే అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించనున్నాయని బిజెపి నాయకుడు ఒకరు పేర్కొన్నారు. పోలింగ్‌కు ముందు పార్టీ పెద్ద తలకాయలు వారణాసిలో మకాం వేసి ఉండటం సాధారణమేనని ఆయన అన్నారు. అమిత్ షా, కేంద్ర మంత్రి జెపి నడ్డా, ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ సహా పార్టీ సీనియర్ ఆఫీస్ బేరర్స్ అనేక రోజులుగా వారణాసిలో మకాం వేసి ఉన్నారు. దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించే ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి రావడం ఎంతో ముఖ్యమని బిజెపి భావిస్తోంది. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో బిజెపి ఓడిపోతే అది, పార్టీకి ప్రత్యేకంగా ప్రధానికి అవమానకరంగా ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందువల్ల ప్రధాని ఒకసారి వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆశీర్వాదాలు తీసుకునే అవకాశం ఉందని, మోదీ రాక సందర్భంగా మద్దతుదారులంతా ఒక్కటయి ఉత్సాహంగా పనిచేయడానికి దోహదపడుతుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే మోదీ రాకకు సంబంధించి తుది నిర్ణయం ఇంకా తీసుకోవలసి ఉందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఒకరు తెలిపారు.

చిత్రం..ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతున్న బిజెపి అధ్యక్షుడు అమిత్ షా