జాతీయ వార్తలు

‘మేక్ ఇన్ ఇండియా’ గర్జన ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహ్రైచ్(యూపీ), ఫిబ్రవరి 24: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను బలహీన ప్రధానిగా అభివర్ణిస్తూ బిజెపి నేతలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని శుక్రవారం ఇక్కడ విరుచుకుపడ్డారు. మోదీ స్వరం సన్నగిల్లుతోందని, బలహీనపడుతోందని వ్యాఖ్యానించారు. ఓ ఎలుక కంటే కూడా మోదీ స్వరం బలహీన పడిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఇప్పుడు మోదీ గర్జిస్తున్న సింహం కాదని వ్యాఖ్యానించారు. ఒప్పుడు మేక్ ఇన్ ఇండియా అంటూ ప్రజలకు పిలుపునిచ్చిన మోదీ స్వర స్థాయి తగ్గిపోయి అన్ని విధాలుగా బలహీనపడిందని మహసీ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన సభలో అన్నారు. ఇంతకు ముందు బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా తనను ఉద్దేశించి ప్రతికూల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాహుల్ మాట్లాడారు. ఓ పక్క మేక్ ఇన్ ఇండియా అంటూ మోదీ గర్జిస్తున్నా మేడ్ ఇన్ చైనా వస్తువులు దేశమంతా అందుబాటులో ఉన్నాయన్నారు.
చివరికి తాను వాడుతున్న ఫోన్ కూడా చైనాలో తయారైందేనని రాహుల్ తెలిపారు. యూపీలో కాంగ్రెస్, ఎస్‌పి కూటమి బలోపేతమవుతున్నందున మోదీ విషయం కక్కుతున్నారని,మత వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. సంపన్నులకే సేవ చేస్తున్న మోదీ వారి బ్యాంకు రుణాలు మాఫీ చేశారని, రుణ భారంతో కునారిల్లుతున్న రైతులను పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.