జాతీయ వార్తలు

నాగా ఒప్పందం ఇప్పుడు గుర్తొచ్చిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్, ఫిబ్రవరి 25: మణిపూర్‌లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం నాగా ఒప్పందంపై తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి ఎన్నికల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తోందని శనివారం ఇక్కడ ఆరోపించారు. ‘నాగా ఒప్పందంవల్ల మీకు వీసమంత ఎత్తు నష్టం జరగదని నేను భరోసా ఇస్తున్నాను. మణిపూర్ ప్రజల ప్రయోజనాలను కాపాడాలన్నదే మా ఉద్దేశం’ అని ప్రధాని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఓ ఇబోబి సింగ్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవపట్టించేందుకు అబద్ధాలను ప్రచారం చేస్తోందని ఎన్నికల సభలో మోదీ విమర్శించారు. నాగా ఒప్పందంపై ఏడాదిన్నర క్రితమే సంతకాలు చేశారన్న ప్రధాని ‘అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు. గాఢ నిద్రలో ఉన్నారా? ఆ విషయం ఆకస్మాతుగా ఇప్పుడే గుర్తుకొచ్చిందా?’ అని నిలదీశారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే దానిపై రాద్ధాంతం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నాగా ఒప్పందంలో అంశాలు రహస్యంగా ఉంచేశారని, రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడ్డారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను ఫణంగా పెట్టారని విమర్శిస్తోంది. నాగా ఒప్పందంపై నేషనలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలిమ్-ఇసాక్-మువా (ఎన్‌ఎస్‌సిఎన్-ఐఎం), కేంద్ర ప్రభుత్వం సంతకాలు చేశాయి. 2015 ఆగస్టులో ఉభయులు ఈ ఒప్పందం చేసుకున్నారు. దఫదఫాలు సంప్రదింపులు తరువాత దీనికి తుదిరూపం వచ్చింది. 18 ఏళ్ల కాలంలో ఏకంగా 80సార్లు చర్చలు, సంప్రదింపులు జరిగాయి.

చిత్రం..ఇంఫాల్‌లో శనివారం బిజెపి నిర్వహించిన ఎన్నికల బహిరంగ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీకి జ్ఞాపికను అందజేస్తున్న మణిపూర్ రాష్ట్ర అధ్యక్షుడు వభానంద, పార్టీ సీనియర్ నేత చవోబా