జాతీయ వార్తలు

ముగిసిన ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 25: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఐదో విడత ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. 51 నియోజకవర్గాల్లో ప్రచారం తార స్థాయిలో సాగింది. కాదేదీ అనర్హం అన్నట్టు గాడిద, కసబ్, పావురాలను ప్రచార అస్త్రాలుగా వాడుకున్నారు. తూర్పు యూపీలోని 11 జిల్లాల పరిధిలో పోలింగ్‌కు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు ఆకట్టుకోడానికి పార్టీలు విశ్వప్రయత్నం చేశాయి. పరస్పర దూషణలు, విమర్శలు, ఆరోపణలు హద్దులు దాటాయి. ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చేసిన ‘గాడిద వ్యాఖ్యలు’ పెద్ద దుమారానే్న రేపాయి. అఖిలేశ్‌పై ప్రధాని తీవ్రస్థాయిలోనే ఎదురుదాడి చేశారు. రేయింబవళ్లూ కష్టపడి పనిచేసే గాడిదలను స్పూర్తిగా తీసుకుని తాము పనిచేస్తున్నామని ప్రధాని తనదైన శైలీలో అఖిలేశ్‌పై విరుచుకుపడ్డారు. ఇదొక్కటే కాదు బిజెపి యేతర పార్టీలన్నీ కసబ్ పార్టీలంటూ అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై బిఎస్పీ అధినేత్రి మాయవతి గట్టిగానే స్పందించారు. అమిత్‌షా కంటే పెద్ద కసబ్ ఎవరంటూ ఆమె నిలదీశారు. అంతటితో ఆగకుండా అమిత్‌షానే ఉగ్రవాది అంటూ ధ్వజమెత్తారు. నాలుగు దశలు ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘం ఐదో విడత పోలింగ్‌కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది.