జాతీయ వార్తలు

ఆంధ్రప్రదేశ్ మీదుగా సూపర్‌ఫాస్ట్ రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఆంధ్రప్రదేశ్ మీదుగా ఎర్నాకులం (కేరళ)- హౌరా (పశ్చిమ బెంగాల్)ల మధ్య నడిచే అంత్యోదయ (అన్‌రిజర్వ్‌డ్) వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సోమవారం ప్రారంభించారు. రైల్వే మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అంత్యోదయ ఎక్‌ప్రెస్‌తోపాటు శ్రీగంగానగర్ (రాజస్థాన్) - తిరుచ్చిరాపల్లి (తమిళనాడు) మధ్య నడిచే హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడ కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఎర్నాకులంలో ప్రతి మంగళవారం తెల్లవారుజామున 12:50 గంటలకు బయలుదేరి, బుధవారం మధ్యాహ్నం 2.50 గంటలకు హౌరా చేరుకుటుంది. అలాగే తిరిగి హౌరాలో శనివారం సాయంత్రం 5 గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం 6 గంటలకు ఎర్నాకులం చేరుకుంటుంది. ఈ అంత్యోదయ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కి 20 జనరల్ బోగీలు ఉంటాయి. ఈ రైలు ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంట, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాళం రోడ్, పలాసలలో అగుతుంది.