జాతీయ వార్తలు

విశ్వాస పరీక్షపై పళనిస్వామికి నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 27: తమిళనాడు అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షపై రాష్టమ్రుఖ్యమంత్రి పళనిస్వామికి అసెంబ్లీ స్పీకర్‌కు, కార్యదర్శి, హోమ్‌కార్యదర్శికి మద్రాసు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మార్చి 10లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తాత్కాలిక న్యాయమూర్తి హుతువాది రమేష్, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన హైకోర్టు బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష డిఎంకె సభ్యుల గెంటివేత, దాని మిత్ర పక్షాల వాకౌట్ నేపథ్యంలో గత శనివారం నాడు పళనిస్వామి అసెంబ్లీలో విశ్వాస ప్రకటన నెగ్గారు. ఆయనకు అనుకూలంగా 122 ఓట్లు, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. రెండు సార్లు అసెంబ్లీ వాయిదా పడ్డ అనంతరం విశ్వాస ప్రకటన నిర్వహించారు. రహస్య ఓటింగ్ జరపాలని డిఎంకె పట్టుబట్టినా స్పీకర్ ఆ డిమాండ్‌ను తిరస్కరించారు. దాంతో అసెంబ్లీ స్పీకర్‌పై డిఎంకె అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.